Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. పూర్తి వివరాలివే..

పెట్టుబడులే లక్ష్యంగా గతంలో విదేశీ పర్యటన చేసిన రేవంత్‌ రెడ్డి... ఇప్పుడు మళ్లీ ఫారెన్‌ ఫైయిట్‌ ఎక్కనున్నారు. ఈసారి జపాన్‌ టూర్‌ షెడ్యూల్‌ కన్ఫామ్‌ అయింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కూడా జపాన్‌ వెళ్లనున్నారు. గతంలో ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది.

Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. పూర్తి వివరాలివే..
Revanth Reddy

Updated on: Mar 25, 2025 | 10:19 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. దాదాపు ఎనిమిది రోజులపాటు జపాన్ పర్యటనలో ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారితన అభివృద్ధితో పాటు తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతోపాటు స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే ఛాన్స్ ఉంది. ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులపై జపాన్ కంపెనీలకు వివరించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించే అవకాశం ఉంది.

ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కూడా జపాన్‌ వెళ్లనున్నారు. గతంలో ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈసారి పర్యటనలో జపాన్ సంస్థల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి పెరగడంతోపాటు రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఏప్రిల్‌ 15 నుంచి 23 వరకు జపాన్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్‌ 15 లోపు డీ లిమిటేషన్‌పై హైదరాబాద్‌లో రెండో మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ బయల్దేరి అక్కడి నుంచి జపాన్ పర్యటనకు వెళ్తారని అధికార వర్గాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us