CM Revanth Reddy: వారు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే.. శత్రువులు కాదు- సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆదిలాబాద్‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పిప్రి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం న్నికల్లో సమయంలోనే రాజకీయాలని.. తర్వాత అంతాకలిసి పనిచేయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ తమకు రాజకీయ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదన్నారు. గతంలో సీఎం, మంత్రులు పర్యటించినప్పుడు ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసేవారని.. కానీ తాము చేయడం లేదన్నారు.

CM Revanth Reddy: వారు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే.. శత్రువులు కాదు- సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Cm Revanth Reddy

Updated on: Apr 06, 2026 | 5:45 PM

సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 225 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపబట్టబోతున్న బాసర జ్ఞాన స‌ర‌స్వతి ఆల‌య పునర్‌ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన తర్వాత జిల్లాలోని పిప్రిలో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసగించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పిప్రి నుంచే భట్టి పాదయాత్ర మొదలు పెట్టారన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయ్యాయన్నారు. భట్టి పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకున్నారని వాటిని తీర్చి ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామని.. ఇప్పుడు దాన్ని నేరవేర్చబోతున్నాం అన్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో విద్య, వైద్యం అందండంలేదని.. ఈ ప్రాంతం వెనుకబాటుకు గత ప్రభుత్వాలే కారణమన్నారు.

రాజకీయాల్లో నాయకుడి పట్ల విశ్వాసం ఉండాలని.. ఎన్నికల్లోనే రాజకీయాలు..తర్వాత అంతాకలిసి పనిచేయాలన్నారు. BJP, BRS తమకు రాజకీయ ప్రత్యర్థులే..శత్రువులు కాదన్నారు. వాళ్లు తమ దృష్టికి తెచ్చిన సమస్యలనూ పరిష్కరిస్తామన్నారు. గతంలో సీఎం, మంత్రులు పర్యటించినప్పుడు ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసేవారని.. కానీ తాము చేయడం లేదన్నారు. తమ ప్రభుత్వం అందరినీ గౌరవిస్తుందన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us