Revanth Reddy: హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.. ఇది మీ అన్న ఇస్తున్న మాట.. సీఎం ఆసక్తికర ట్వీట్..

|

Dec 07, 2023 | 4:12 PM

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై రేవంత్‌తో ప్రమాణం చేయించారు . ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను బద్ధలుకొట్టామని అన్నారు. ప్రగతి భవన్‌ ఇకపై జ్యోతిరావు పూలె ప్రజా భవన్‌గా మారుస్తామని అన్నారు.

Revanth Reddy: హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.. ఇది మీ అన్న ఇస్తున్న మాట.. సీఎం ఆసక్తికర ట్వీట్..
Revanth Reddy
Follow us on

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై రేవంత్‌తో ప్రమాణం చేయించారు . ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను బద్ధలుకొట్టామని అన్నారు. ప్రగతి భవన్‌ ఇకపై జ్యోతిరావు పూలె ప్రజా భవన్‌గా మారుస్తామని అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణను ప్రపంచంతో పోటీపడే విధంగా తయారు చేస్తామని.. పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు తాము పాలకులం కాదని.. సేవకులమని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం సూచనలతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన కార్యకర్తలను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటానని అన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల అమలుకు సంబంధించిన ఫైలుపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం ఇస్తామనే మాటను కూడా రేవంత్ రెడ్డి నిలుపుకున్నారు.

అనంతరం తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.. అంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు..

‘‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఇది మీ అన్న ఇస్తున్న మాట.’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..