Telangana: స్మశానం నుంచి వినిపించిన మూలుగు శబ్ధాలు.. తీరా వెళ్లి చూసేసరికి షాక్!

| Edited By: Balaraju Goud

Oct 22, 2024 | 4:03 PM

ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అక్కడే ఉన్న స్మశాన వాటికకు తరలించి వరండాలో పడుకోబెట్టి వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత వృద్ధురాలి మూలుగు శబ్దాలు విన్న స్థానికులు కొందరు అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు.

Telangana: స్మశానం నుంచి వినిపించిన మూలుగు శబ్ధాలు.. తీరా వెళ్లి చూసేసరికి షాక్!
Old Woman In Graveyard
Follow us on

కరీంనగర్ జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రాణాలు ఉన్న వృద్ధురాలిని స్మశానంలో వదిలి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు.. స్మశానం నుంచి మూలుగు శబ్ధాలు ఉన్న స్థానికులు వెళ్లి చూసేసరికి ప్రాణాలతో ఉన్న వృద్ధురాలు కనిపించింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కూకట్ల రాజవ్వ (70) అనే వృద్ధురాలిని ఇవ్వాలా ఉదయం ఎవరు లేని సమయంలో స్మశాన వాటికలో ఉన్న వరండాలో వదిలేసి ఘటన చోటు చేసుకుంది.

వృద్ధురాలు అయిన రాజవ్వకు భర్త కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. కొడుకులు, బిడ్డలు లేకపోవడంతో మేనల్లుడు అయిన కూకట్ల తిరుపతి ఇంటి వద్ద గత కొంత కాలంగా నివసిస్తోంది. వృద్ధురాలు అయిన ఆమెకు అనారోగ్య సమస్యలు, ఆమె రోజువారీ రీత్యా పనులు చేసుకోకపోవడంతో తిరుపతి కుటుంబ సభ్యులకు భారంగా మారింది. అయితే మంగళవారం(అక్టోబర్22) ఉదయం రాజవ్వ సోదరి పిల్లలు తిరుపతి ఇంటికి వచ్చి చికిత్స కోసమని సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తున్నామని చెప్పారు. డయాలసిస్ చేపిస్తానని ఆమెను ఒక ఆటోలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు.

అయితే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అక్కడే ఉన్న స్మశాన వాటికకు తరలించి వరండాలో పడుకోబెట్టి వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత వృద్ధురాలి మూలుగు శబ్దాలు విన్న స్థానికులు కొందరు అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడటంతో స్థానిక ఎమ్మార్వోకి సమాచారం ఇచ్చారు స్థానికులు. సంబంధిత అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె మేనల్లుడు కూకట్ల తిరుపతి పిలిపించి మందలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స చేయించి, రాజవ్వ బాగుగోలు చూసుకుంటామని చెబితే పంపించామని, వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదని తిరుపతి తెలిపాడు.

అనంతరం రాజవ్వను ఇంటికి తరలించి, ఆమె బాగు చూసుకుంటామని అక్కడ ఉన్న పోలీసులకు, అధికారులకు తెలిపాడు తిరుపతి. అక్కడ ఉన్న స్థానికులు కొన ఊపిరితో ఉన్న వృద్ధురాలిని స్మశానంలో విడిచిపెట్టిన హృదయవిదారకమైన ఘటన చూసి చలించిపోయారు. మానవత్వం మంటగలిచే ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని కోరుకుంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..