అంత్యక్రియలకు ముందు రవళి మృతదేహానికి వివాహం

ప్రేమోన్మాది దాడితో దాదాపు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించిన రవళి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. అంత్యక్రియలకు ముందు ఆమె మృతదేహానికి వివారం జరిపించారు రవళి తల్లిదండ్రులు. మంచి వరుడిని చూసి తమ బిడ్డకు పెళ్లిచేయాలని భావించిన రవళి తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూడటం కూడా మొదలుపెట్టారు. అయితే ఆ లోపే రవళి ప్రేమోన్మాది దాడిలో మరణించింది. దీంతో తమ కోరికను తీర్చుకునేందుకు ఓ అరటి చెట్టుతో శాస్త్రోక్తంగా రవళి వివాహం జరిపించారు […]

అంత్యక్రియలకు ముందు రవళి మృతదేహానికి వివాహం

Edited By:

Updated on: Mar 08, 2019 | 11:36 AM

ప్రేమోన్మాది దాడితో దాదాపు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించిన రవళి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. అంత్యక్రియలకు ముందు ఆమె మృతదేహానికి వివారం జరిపించారు రవళి తల్లిదండ్రులు. మంచి వరుడిని చూసి తమ బిడ్డకు పెళ్లిచేయాలని భావించిన రవళి తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూడటం కూడా మొదలుపెట్టారు. అయితే ఆ లోపే రవళి ప్రేమోన్మాది దాడిలో మరణించింది. దీంతో తమ కోరికను తీర్చుకునేందుకు ఓ అరటి చెట్టుతో శాస్త్రోక్తంగా రవళి వివాహం జరిపించారు తల్లిదండ్రులు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

అయితే హన్మకొండకు చెందిన రవళిపై గత వారం అన్వేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒంటినిండా గాయాలతో ఆరు రోజులు మృత్యువుతో పోరాడిన రవళి సోమవారం నాడు కన్నుమూసిన విషయం తెలిసిందే.