Telangana: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. బీజేఎల్పీ లాబీలో రాజాసింగ్.. కేటీఆర్ రియాక్షన్ చూశారా?

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లాబీలో సోమవారం ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది. గత ఏడు నెలల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ అసెంబ్లీ లాబీలోని బీజేఎల్పీ ఛాంబర్‌లో కనిపించడం, బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Telangana: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. బీజేఎల్పీ లాబీలో రాజాసింగ్.. కేటీఆర్ రియాక్షన్ చూశారా?
Raja Singh In Bjlp

Updated on: Mar 16, 2026 | 4:26 PM

తెలంగాణ బడ్జెల్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్ BJLP చాంబర్‌లోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో బయటికి వెళ్తూ రాజసింగ్‌ను గమనించిన కేటీఆర్.. సస్పెండ్ ఐన వ్యక్తి BJLP లోకి ఎలా అంటు సెటైర్ వేయడం చర్చకు దారి తీసింది

బీజేఎల్‌పీ నుంచి బయటికిరావాలి అని రాజాసింగ్‌ను కేటీఆర్ సరదాగా పిలవగా.. మీరు కూడా బీజేఎల్‌పీ ఛాంబర్ లోకి రావాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆహ్వానించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. తాను అక్కడికి వస్తె మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

ఇక ఇదే ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. బీజేఎల్పీ తన పాత ఇల్లని.. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తన పాత ఫ్రెండ్స్‌ అని చెప్పుకొచ్చారు. తాను పాత ఫ్రెండ్స్ ను కలవడానికి బీజేఎల్పీలోకి వెళ్ళానని, అక్కడికి ఎప్పుడైనా వెళ్లొచ్చు రావొచ్చుని అన్నారు. అయితే పార్టీలో మళ్లీ చేరడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఎవరు ఎవరిని బతిమాలుతున్నారో భవిష్యత్‌లో తెలుస్తుందని చిట్‌చాట్‌లో రాజాసింగ్ చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us