Congress: ఎన్నికల ప్రచార బరిలోకి ఏఐసిసి పెద్దలు.. తెలంగాణలో దూసుకుపోతున్న కాంగ్రెస్..

| Edited By: Srikar T

May 04, 2024 | 9:48 PM

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. రేపటి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలోకి రాబోతున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకుల ఎన్నికల సభలకు రాష్ట్ర కాంగ్రెస్ షెడ్యూల్‎ని సిద్ధం చేసింది. పార్లమెంటు ఎన్నికలక గడువు దగ్గర పడుతున్న కొద్ది ప్రచారంలో జోష్ పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలను.. కార్నర్ మీటింగ్లతో దూకుడు పెంచారు.

Congress: ఎన్నికల ప్రచార బరిలోకి ఏఐసిసి పెద్దలు.. తెలంగాణలో దూసుకుపోతున్న కాంగ్రెస్..
Rahul Gandhi And Priyanka
Follow us on

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. రేపటి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలోకి రాబోతున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకుల ఎన్నికల సభలకు రాష్ట్ర కాంగ్రెస్ షెడ్యూల్‎ని సిద్ధం చేసింది. పార్లమెంటు ఎన్నికలక గడువు దగ్గర పడుతున్న కొద్ది ప్రచారంలో జోష్ పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలను.. కార్నర్ మీటింగ్లతో దూకుడు పెంచారు. ఎన్నికల గడువు దగ్గర పడుతున్న వేళ పార్టీ అగ్ర నాయకుల్ని కూడా తెలంగాణలో ప్రచారానికి పిలవాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ఆదివారం నుంచి మొదలుకాబోతోంది. తర్వాత ప్రియాంక గాంధీ, ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అవసరాన్ని బట్టి సోనియా గాంధీతో ఎన్నికల ప్రసంగాన్ని ఇప్పించాలని పార్టీ భావిస్తోంది.

ఆదివారం నాందేడ్ నుంచి రాహుల్ గాంధీ నేరుగా నిర్మల్‎కి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఉదయం 11 తర్వాత నిర్మల్‎లో ఎన్నికల ప్రచార సభ జరగనుంది. ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు నిర్మల్‎కి చేరుకుంటారు. నిర్మల్‎లో సభ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు నేరుగా అలంపూర్‎కు చేరుకుంటారు. అలంపూర్‎లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ సభ ప్రారంభం కాబోతోంది. సభ ముగిసిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకి రాహుల్ గాంధీ చేరుకుంటారు. సమయాన్ని బట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఇలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ప్రియాంక గాంధీ మే 6 సాయంత్రం హైదరాబాద్‎కు చేరుకుంటారు. వరుసగా రెండు రోజులపాటు తెలంగాణలో నిర్వహించనున్న ఎన్నికల సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. 7 ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం కూకట్ పల్లి కార్నర్ మీటింగ్‎కు హాజరవుతారు. మే 8 న సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత మే 9న రాహుల్ గాంధీ తిరిగి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..