Telangana Governor : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2021 అవార్డు తమిళసైను వరించింది. యూఎస్ కాంగ్రెస్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారు అందించే ఈ అవార్డుకు డా. తమిళిసై సౌందరరాజన్ ఎంపికయ్యారు. గవర్నర్ తమిళసైతో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. ఈ నెల 7వ తేదీన అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. సమాజం హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున డా. తమిళిసై సౌందరరాజన్‌ను ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.
ఇటీవల గవర్నర్ తమిళిసై తను బాధ్యతలు చేపట్టిన నుంచి జరిగిన పరిణామాలను ఒక్కదగ్గర చేర్చుతూ పుస్తకం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తన అమూల్యమైన అనుభవాలకు అక్షరరూపం దాల్చుతూ.. ‘మూవింగ్ ఫార్వార్డ్ విత్ మెమొరీస్ ఆఫ్ మెయిడెన్ ఇయర్’పుస్తకాన్ని రిలీజ్ చేశారు. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్. ఈమె తమిళనాడుకు చెందిన మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వైద్యురాలు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా భాద్యతలు చేపట్టింది. ఈమె 1961 జూన్ 2న కృష్ణ కుమారి, కుమార్ అనంతన్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ ప్రాంతంలో జన్మించింది. ఈమె తండ్రి కుమారి అనంతన్ మాజీ లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆమె వృత్తి రీత్యా వైద్యులు.
మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా..? సమయానికి ప్రీమియం కట్టలేక వదిలేసారా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే..
Mike procter: వరుసగా 6 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు.. క్రికెట్ చరిత్రలో అలాంటి ఘనత ఎవరు సాధించారో తెలుసా..