Telangana: అంతా ఒరిజినల్‌ అన్నారు.. ఢోకా లేనే లేదన్నారు.. చివరకు వారు చేసి పని ఇది..!

|

Feb 26, 2022 | 10:16 PM

Telangana: సగం ధరకే గోల్డ్‌ ఇస్తాం.. ఎలాంటి అనుమానం లేదు.. అంతా ఒరిజినల్‌.. ఎక్కడా ఢోకా లేదు.. అని తమను నమ్మి వచ్చిన వారిని ఊదరగొట్టారు.

Telangana: అంతా ఒరిజినల్‌ అన్నారు.. ఢోకా లేనే లేదన్నారు.. చివరకు వారు చేసి పని ఇది..!
Gold
Follow us on

Telangana: సగం ధరకే గోల్డ్‌ ఇస్తాం.. ఎలాంటి అనుమానం లేదు.. అంతా ఒరిజినల్‌.. ఎక్కడా ఢోకా లేదు.. అని తమను నమ్మి వచ్చిన వారిని ఊదరగొట్టారు. ప్లాన్‌ను అమలు చేసి నమ్మిన వారిని నట్టేటా ముంచుతారు. అమాయకులు కొన్న వెంటనే.. అమ్మకం దారులు అక్కడి నుంచి మకాం మార్చుతారు. ఇంకో గ్యాంగ్‌ మాత్రం 30 లక్షల గోల్డ్‌.. 10 లక్షలకే ఇస్తామంటూ బేరం పెట్టుకుంది. చివరాఖరుకు ఇది మోసం అని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా భైంసాలో జరిగింది.

వివరాల్లోకెళితే.. తక్కువ రేటుకే గోల్డ్‌ అంటూ మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు పోలీసులు. నిజామాబాద్‌కు చెందిన కళ్యాణ్ కుమార్ అనే వ్యక్తి గోల్డ్‌ వ్యాపారం కోసం భైంసాకి వెళ్తుంటాడు. కళ్యాణ్‌తో నిర్మల్‌ తానురుకు చెందిన బాబు, బాలాజీలకు పరిచయం ఉంది. బాబు, బాలాజీలు.. మహారాష్ట్రలోని యావత్‌ మాల్‌ జిల్లాకు చెందిన మరో ముగ్గురితో ముఠాగా ఏర్పడ్డారు. పక్కా ప్లాన్‌తో రూ. 30 లక్షల గోల్డ్‌ని రూ. 10 లక్షలకే ఇప్పిస్తామంటూ నకిలీ గోల్డ్‌ను అంటగట్టారు. రూ. 10 లక్షలు ఇచ్చిన కళ్యాణ్‌కు బంగారం పూత పూసిన నకిలీ గోల్డ్‌ను ఇచ్చారు. ఇంటికి వెళ్లి చూశాక అది నకిలీ గోల్డ్ అని తేలింది. దాంతో అప్రమత్తమైన కళ్యాణ్ పోలీసులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్‌తో ముఠాలోని ముగ్గురిని పట్టుకున్నారు పోలీసులు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.

Also read:

IIPS Mumbai Jobs: ఐఐపీఎస్‌లో అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ  ద్వారానే ఎంపికలు..

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌.. రెండు దేశాలలో ఎవరు ఎక్కువ శక్తివంతులు

Russia – Ukraine Conflict: పారిపోను.. ఆయుధాలివ్వండి.. అమెరికా ఆఫర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి రిప్లై..