
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా “మేరే సే జోడో” (నాతో జతకట్టండి) అనే మాట మార్మోగిపోతోంది. ప్రధాని మోదీ చేసిన “మేరే సే జోడో” కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లోని HICCలో రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది.
సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి పూర్తి సహకారం అందించారని గుర్తుచేశారు. అదే తరహాలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం పెద్ద మనసుతో సహకరించాలని కోరారు. దీనికి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ, రేవంత్ వ్యాఖ్యలను చాలా చాకచక్యంగా తిప్పికొట్టారు. “నాడు గుజరాత్‌కు అందిన నిధుల కంటే, నేడు తెలంగాణకు రెట్టింపు నిధులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రేవంత్ చెప్పినట్టు గుజరాత్ తరహాలోనే నిధులు ఇస్తే తెలంగాణకు ఇప్పుడు వస్తున్న దానిలో సగమే వస్తాయని” మోదీ చమత్కరించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రకు, తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమానికి కౌంటర్‌గా ప్రధాని మోదీ ఈ పదాన్ని ప్రయోగించడం గమనార్హం. అయితే తెలంగాణ ప్రగతి కోసం కేంద్రంతో కలిసి నడవాలని, రాష్ట్రానికి అవసరమైన సహాయం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తే, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేంద్రంతో సఖ్యతగా ఉండటాన్ని బీజేపీ తనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం అభివృద్ధి పనుల కోసమే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారా? లేక కాంగ్రెస్ నినాదాన్ని (జోడో) హైజాక్ చేస్తూ రేవంత్‌కు స్నేహహస్తం అందించారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్. ఏది ఏమైనా, “మేరే సే జోడో” అనే నినాదం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా నిలిచిపోనుంది. కేంద్ర-రాష్ట్రాల మధ్య ఈ ‘బంధం’ భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందో చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..