PM Modi: తెలంగాణలో RR ట్యాక్స్ తీసుకొచ్చారు.. తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రధాని మోదీ వార్నింగ్‌

తెలంగాణలో డబుల్ R ట్యాక్స్ తీసుకొచ్చారు.. డబుల్ R ట్యాక్స్‌పై విస్తృత చర్చ జరుగుతోంది.. వ్యాపారులు, కాంట్రాక్టర్లు RR ట్యాక్స్ కడుతున్నారు.. డబుల్ R ట్యాక్స్‌తో నల్లధనం ఢిల్లీకి చేరుతోంది.. RR ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. RR ట్యాక్స్‌ను అడ్డుకోకపోతే సర్వనాశనం తప్పదు.. అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఫైర్ అయ్యారు.

PM Modi: తెలంగాణలో RR ట్యాక్స్ తీసుకొచ్చారు.. తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రధాని మోదీ వార్నింగ్‌
Pm Modi
Follow us

|

Updated on: Apr 30, 2024 | 9:50 PM

తెలంగాణలో డబుల్ R ట్యాక్స్ తీసుకొచ్చారు.. డబుల్ R ట్యాక్స్‌పై విస్తృత చర్చ జరుగుతోంది.. వ్యాపారులు, కాంట్రాక్టర్లు RR ట్యాక్స్ కడుతున్నారు.. డబుల్ R ట్యాక్స్‌తో నల్లధనం ఢిల్లీకి చేరుతోంది.. RR ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. RR ట్యాక్స్‌ను అడ్డుకోకపోతే సర్వనాశనం తప్పదు.. అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఫైర్ అయ్యారు. జహీరాబాద్ బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాళేశ్వరంప్రాజెక్ట్ పేరుతో BRS పెద్దస్కామ్ చేసిందన్నారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేస్తామని కాంగ్రెస్ మాట తప్పిందంటూ విమర్శించారు. ఓటుకు నోటు కేసును గతంలో బీఆర్‌ఎస్‌ తొక్కిపెట్టిందని.. కాళేశ్వరం స్కామ్‌ని కాంగ్రెస్ తొక్కిపెడుతోందని ఆరోపించారు.

అవినీతిలో ఆ రెండు పార్టీలు భాగస్వాములేనని.. గతంలో బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసింది.. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్వనాశనం చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులేనని వివరించారు. కాంగ్రెస్‌ మరో దోపిడీకి సిద్ధమైందని.. ప్రజలపై వారసత్వ పన్ను విధించబోతోంది.. మీ సంపదలో 55% లాక్కుంటామని చెబుతోందంటూ మోదీ అన్నారు.

ఫేక్‌ వీడియోపై కూడా ప్రధాని మోదీ స్పందిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్‌కి మోదీ వార్నింగ్‌ ఇచ్చారు. రేవంత్‌ రెడ్డి ఫేక్ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఫేక్ వీడియోలను విడుదల చేసినవాళ్లను వదిలే ప్రసక్తే లేదు.. RRకి తెలంగాణ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ గెలుపుతోనే సాధ్యమన్నారు.

ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని.. ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. మాదిగలకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు.

క్వింటాల్‌కి రూ.500 బోనస్ అని బోగస్ మాటలు చెప్పారు.. రుణమాఫీపై తెలంగాణలో కాంగ్రెస్ మాట తప్పింది.. 100రోజుల్లో రుణమాఫీ అని కాంగ్రెస్ మోసంచేసిందంటూ ఫైర్ అయ్యారు.

వీడియో చూడండి..

లింగాయత్‌ రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం.. ముస్లిం రిజర్వేషన్లకు మాత్రం కాంగ్రెస్ అనుకూలం అంటూ మోదీ అన్నారు. బంజారా రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయన్నారు.

అంబారీపై రాజ్యాంగం వెళ్తుంటే నేను నడుచుకుంటూ వెళ్లా.. రాజ్యాంగం అంటే అంత గౌరవం మాకు.. నా తుదిశ్వాస వరకు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అంటూ మోదీ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని
కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌
కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌
వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!
వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!
జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్
జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్
తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధం.. ఓడినా మరో ఛాన్స్..
తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధం.. ఓడినా మరో ఛాన్స్..
యువతలో పెరుగుతోన్న బ్రెయిన్‌ స్ట్రోక్‌.. కారణాలు ఇవే..
యువతలో పెరుగుతోన్న బ్రెయిన్‌ స్ట్రోక్‌.. కారణాలు ఇవే..
డిగ్రీ అర్హతతతో దేశ త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. UPSC ద్వారా ఎంపిక
డిగ్రీ అర్హతతతో దేశ త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. UPSC ద్వారా ఎంపిక
బాలిక మృతిపై సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర వైద్య మండలి ,
బాలిక మృతిపై సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర వైద్య మండలి ,
కోల్‌కతా ప్లేయింగ్ 11లోకి తుఫాన్ ప్లేయర్ ఆగయా..
కోల్‌కతా ప్లేయింగ్ 11లోకి తుఫాన్ ప్లేయర్ ఆగయా..
మే 24 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
మే 24 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం