Telangana: క్రమశిక్షణ పేరుతో పీఈటీ టీచర్ అత్యుత్సాహం.. 2 జ‌డ‌లు వేసుకోలేద‌ని స్టూడెంట్స్ తో గుంజీలు

పాఠ‌శాల‌లో చ‌దువుతున్న కొందరు విద్యార్థినులు రెండు జ‌డ‌లు వేసుకోలేదు. దీంతో పీఈటీ శ్వేత కోపంతో ర‌గిలిపోయారు. రెండు జ‌డ‌లు వేసుకోని అమ్మాయిల‌ను ప‌క్కకు పిలిపించింది. వారిని హింసిస్తూ, గుంజీలు తీయించింది.

Telangana: క్రమశిక్షణ పేరుతో పీఈటీ టీచర్ అత్యుత్సాహం.. 2 జ‌డ‌లు వేసుకోలేద‌ని స్టూడెంట్స్ తో గుంజీలు
Studets Sick

Updated on: Aug 05, 2022 | 6:14 PM

Telangana: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు.. క్రమశిక్షణ పేరుతో రాక్షకానందం పొందుతున్నారు. విద్యార్థినులు 2 జ‌డ‌లు వేసుకోలేద‌ని ఓ పీఈటీ వారిని తీవ్రంగా హింసించి, గుంజీలు తీయించి, పైశాచిక ఆనందం పొందింది. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చర్లలోని మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌లో చోటు చేసుకుంది. పాఠ‌శాల‌లో చ‌దువుతున్న కొందరు విద్యార్థినులు రెండు జ‌డ‌లు వేసుకోలేదు. దీంతో పీఈటీ శ్వేత కోపంతో ర‌గిలిపోయారు. రెండు జ‌డ‌లు వేసుకోని అమ్మాయిల‌ను ప‌క్కకు పిలిపించింది. వారిని హింసిస్తూ, గుంజీలు తీయించింది.
ఈ క్రమంలో పిల్లల‌కు తీవ్రమైన కాళ్ల నొప్పులు వ‌చ్చాయి. అస్వస్థత‌కు గుర‌య్యారు. కాళ్ల నొప్పుల‌తో న‌డిచేందుకు సైతం ఇబ్బంది ప‌డ్డారు. అస్వస్థత‌కు గురైన పిల్లల‌ను గుట్టుచప్పుడు కాకుండా ప్రిన్సిప‌ల్ ఇంటికి పంపించేశారు. విద్యార్థినులు త‌మ‌కు జ‌రిగిన అవ‌మానంపై త‌ల్లిదండ్రుల‌కు చెప్పుకున్నారు. అత్యుత్సాహం ప్రద‌ర్శించిన పీఈటీపై చ‌ర్యలు తీసుకుకున్నారు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..