Kadam: అందుబాటులోకి వచ్చిన వంతెన.. తీరనున్న ఇక్కట్లు.. గ్రామస్థులు హర్షం

|

Aug 18, 2022 | 6:23 AM

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గతంలో కడెం (Kadam) ప్రాజెక్టు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో ప్రాజెక్టు వరదకు కొట్టుకుపోయిన పాండవపూర్ వంతెనను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం...

Kadam: అందుబాటులోకి వచ్చిన వంతెన.. తీరనున్న ఇక్కట్లు.. గ్రామస్థులు హర్షం
Follow us on

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గతంలో కడెం (Kadam) ప్రాజెక్టు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో ప్రాజెక్టు వరదకు కొట్టుకుపోయిన పాండవపూర్ వంతెనను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా ఇబ్బంది పడ్డ ప్రజలు తమ అవస్థలు తీరిపోయాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వరదలకు కొట్టుకుపోయిన నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవపూర్ వంతెన తాత్కాలిక వంతెన మరమ్మతులు పూర్తయ్యాయి. వంతెన కొట్టుకుపోవడంతో నిర్మల్ (Nirmal) , మంచిర్యాల జిల్లాల మధ్య 37 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. నెల రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు భారీగా వరద ఉద్ధృతి పెరగడంతో పాండవపూర్ వంతెన కొట్టుకుపోయింది. పాండవపూర్ వంతెనను రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ పరిశీలించారు. నెలరోజుల్లో ప్రజలకు వంతెనను అందుబాటులోకి తెస్తామని చెప్పారు సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్రీనివాస రాజు. వంతెన మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేయించారు. వంతెన పనులకు మరమ్మతులు చేపట్టి, నెలరోజుల్లో నిర్మల్, మంచిర్యాల రహదారిని అందుబాటులోకి తెచ్చారు.

కాగా.. గత నెలలో కురిసిన భారీ వర్షాలు కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నిర్మల్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్ట్ ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. కడెం, కన్నపూర్, దేవునిగూడెం, రాపర్, మున్యాల్, గొడిషిరియల్ గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ కోసం క్లిక్ చేయండి..