New Exam Pattern: పాలిటెక్నిక్ కోర్సులో నిర్వహించే సెమిస్టర్ పరీక్షల్లో ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు విధానానికి స్వస్తి పలుకుతూ నూతన విధానానికి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ శ్రీకారం చుడుతోంది. ఇంతకాలం పాలిటెక్నిక్ కోర్సుల్లో సెమిటిర్ మధ్యలో రెండుసార్లు మిడ్ పరీక్షలు నిర్వహించేవారు.
అయితే ఇప్పుడు విధానానికి గుడ్ బై చెప్పారు. 3, 5వ సెమిస్టర్లలో వీటిని రద్దు చేసి ఒకే పరీక్ష నిర్వహించాలని ఎస్‌బీటెట్(స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్ అండ్ ట్రైనింగ్) నిర్ణయించింది. దీనికి సంబంధించిన థియరీ పరీక్షలు ఫిబ్రవరి 22వ తేదీ నుంచి జరుగుతాయని, విద్యార్థులు ఫిబ్రవరి 6వ తేదీలోపు పరీక్ష చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీటెట్ ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌బీటెట్ కార్యదర్శి శ్రీనాథ్.. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.
Also read:
India Corona Cases: దేశంలో కొత్తగా 14,256 కోవిడ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా