Coronavirus: డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కరోనా కొత్త వేరియంట్‌.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా..?

|

Dec 21, 2023 | 9:36 PM

నీడనే కాదు.. గాలిని..ధూళిని నమ్మోద్దు.. భూమ్మీద నూకలుండాలంటే మళ్లీ ముక్కుకు నోటీకి మస్ట్‌గా మాస్క్ పెట్టాల్సిందే. మాయదారి కరోనా మళ్లీ చాపకిందనీరులా పంజా విసరబోతుందా? డేంజర్‌ బెల్స్‌ మోగనే మోగాయి. కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా JN 1 వేరియంట్‌ సంబంధించిన తొలి కేసును ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు.

Coronavirus: డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కరోనా కొత్త వేరియంట్‌.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా..?
Corona Cases
Follow us on

నీడనే కాదు.. గాలిని..ధూళిని నమ్మోద్దు.. భూమ్మీద నూకలుండాలంటే మళ్లీ ముక్కుకు నోటీకి మస్ట్‌గా మాస్క్ పెట్టాల్సిందే. మాయదారి కరోనా మళ్లీ చాపకిందనీరులా పంజా విసరబోతుందా? డేంజర్‌ బెల్స్‌ మోగనే మోగాయి. కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా JN 1 వేరియంట్‌ సంబంధించిన తొలి కేసును ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్‌ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులను చైనాలో కూడా గుర్తించారు. ఇప్పుడూ ఆ తరహాలోనే తొలి కేసు.. కేరళలోని తిరువనంతపురంలో నమోదయ్యింది. ఈ కేసులు వేగంగా వ్యాపిస్తాయేమోనన్న అనుమానాలు దడ పుట్టిస్తున్నాయి.

కాగా.. భారత్‌లో కొత్తగా 594 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 2వేల 699 జేఎన్‌ 1 పాజిటివ్‌ కేసుల్ని గుర్తించారు. కేరళలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. కొత్త వేరియంట్‌ స్ప్రెడ్‌ అవుతోన్న క్రమంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. చెస్ట్‌ హాస్పిటల్‌లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. కొత్త వేరియంట్‌ను గుర్తించేలా టెస్టులు పెంచుతున్నామన్నారు సూపరింటెండెంట్‌ ఖాన్‌. తగు జాగ్రత్తలు పాటిస్తే చాలు..కంగారు పడాల్సిన అవసరం లేదంటూ సూచించారు.

ఇదిలాఉంటే.. తెలంగాణ‌లో కొత్తగా ఆరు క‌రోనావైరస్ కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వ‌ర‌కు రాష్ట్రంలో 20 క‌రోనా కేసులు న‌మోదు కాగా, ప్రస్తుతం 19 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఒక‌రు రిక‌వ‌రి అయ్యారు. తాజాగా న‌మోదైన ఆరు కేసుల్లో హైద‌రాబాద్ నుంచి నాలుగు, మెద‌క్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి. తెలంగాణ‌లో రిక‌వ‌రీ రేటు 99.51 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కరోనా కొత్త వేరియంట్‌ లక్షణాలేంటి?

కరోనా కొత్త వేరియంట్‌ లక్షణాలేంటి? అదే ఎలా పంజా విసరుగుతుంది. జేఎన్‌ 1 వేరియంట్‌ నుంచి మనం మనల్ని రక్షించుకోవడం ఎలా? అని పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇది అంతగా ప్రమాదమేమి లేదని.. కానీ జాగ్రత్తలు మాత్రం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండటం అనేది కీలకమే.. కానీ భయపడాల్సిన అవసరం అంతగా లేదు. అలాగని నిర్లక్ష్యం తగదు. దగ్గు జలుబు.. జ్వరం సీజన్‌ల్‌గా వచ్చేవే. అలాగని పారాసిటిమల్‌తో సరిపెట్టుకోవద్దు. వేరియంట్‌ మారింది. జాగ్రత్తల్లోనూ మార్పు రావాలి. మూడు నాలుగు రోజులైనా జలుబు, జ్వరం, దగ్గు తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లక్షణాలున్నా లేకున్నా మాస్క్‌ ధరించడం మస్ట్‌ అంటున్నారు నిపుణులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..