Telangana: ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. రొమ్ములో పెరిగిన 3.5 కిలోల గడ్డ తొలగింపు

నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గుడ్మిట్కల్ గ్రామానికి చెందిన శంకరమ్మ అనే మహిళ కుడివైపు రొమ్ములో ఉన్న 3.5 కిలోల బరువున్న గడ్డను తొలగించారు. గత ఎనిమిదేళ్లుగా ఆమె ఈ సమస్యతో బాధపడుతున్నారు. ..

Telangana: ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. రొమ్ములో పెరిగిన 3.5 కిలోల గడ్డ తొలగింపు
3.5 Kg Breast Tumor

Edited By:

Updated on: Oct 16, 2026 | 4:36 PM

 

నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఫిలోడ్స్ ట్యూమర్‌ (Phyllodes Tumor) సమస్యతో బాధపడుతున్న మహిళకు ఆపరేషన్ చేసి, ఏకంగా 3.5 కిలోల బరువున్న రొమ్ము గడ్డను తొలగించారు. నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. గుడ్మిట్కల్ గ్రామానికి చెందిన శంకరమ్మ అనే మహిళ గత ఎనిమిదేళ్లుగా కుడివైపు రొమ్ములో గడ్డతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆమె నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు పరీక్షించి చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చుకున్నారు.

3.5 కిలోల గడ్డ తొలగింపు

వైద్యులు అక్టోబర్ 13, 2026న జనరల్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో శంకరమ్మకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 3.50 కిలోల బరువున్న గడ్డను విజయవంతంగా తొలగించారు. అనంతరం గడ్డ స్వభావాన్ని నిర్ధారించేందుకు నమూనాను బయాప్సీ పరీక్షకు పంపించారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత గడ్డకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఈ శస్త్రచికిత్సలో జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మురళీకృష్ణతో పాటు డాక్టర్ ఆదిత్య, డాక్టర్ వినీల, డాక్టర్ రత్న, డాక్టర్ రహీం, డాక్టర్ వివేక్ పాల్గొన్నారు. అనస్థీషియా విభాగం నుంచి డాక్టర్ నీలవర్ణ, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సాయికుమార్ సేవలందించారు. స్టాఫ్ నర్సులు ప్రవళిక, స్వప్న, కిరణ్, గోపి ఆపరేషన్‌కు సహకరించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. సంపత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్య బృందం సమన్వయంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. 3.5 కిలోల గడ్డను తొలగించిన శస్త్రచికిత్స విజయవంతం కావడంపై వైద్య బృందాన్ని అభినందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us