Tarakaratna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత..

రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న సొంతింట్లో ఆయన భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తారకరత్న భౌతికకాయాన్ని చూసి బాలయ్య కూడా కంటతడి పెట్టుకున్నారు.

Tarakaratna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత..
Alekhya Reddy

Updated on: Feb 19, 2023 | 5:47 PM

తారకరత్న భార్య అస్వస్థతకు లోనయ్యారు. ఆహారం తీసుకోకపోవడంతో.. ఆమె నీరసించారు. అలేఖ్యను ఆస్పత్రిలో చేర్చే యోచనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. భర్త కోలుకుంటాడేమో అనే ఆశతో 23 రోజులపాటు వేచి చూసింది అలేఖ్య. తన భర్త తిరిగి మాములు మనిషి అవ్వాలని వెయ్యి దేవుళ్లకు మొక్కింది. కానీ తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ వార్త నిజం కాకపోతే బాగుండని కోరుకుంది. భర్త విగతజీవిగా ఎదురుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది. మానిసిక ఒత్తిడికి లోనయ్యింది. పొద్దున్నంచి ఏడుస్తూనే ఉంది. ఏడ్చి.. ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. శనివారం రాత్రి నుంచి ఆమె ఎలాంటి ఆహారం తీసుకోలేదు. దీంతో తీవ్రంగా నీరసించిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించే యోచనలో ఉన్నారు వైద్యులు.

తారకరత్నకు చంద్రబాబు, లోకేశ్ నివాళి…

తారకరత్న మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు నారా లోకేశ్. యువగళం పాదయాత్రను తాత్కాలికంగా రద్దు చేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. తారకరత్న భౌతిక కాయాన్ని చూసి ఉద్వేగం చెందారు. ఆయనతో తన అనుబంధాన్ని తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు.

తారకరత్న మృతి బాధాకరమన్నారు చంద్రబాబు. మృత్యువుతో పోరాడి తిరిగి వస్తాడనుకున్నా.. విధి మరోలా తలచిందన్నారు. తారకరత్న మరణం తమ కుటుంబానికి తీరని లోటంటూ ఉద్వేగంతో మాట్లాడారు. చిన్న వయసులోనే మృతి చెందడం దురదృష్టకరమన్నారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..