Delhi liquor Scam: కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి.. సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్.. ఈడీ కేసులో..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సీబీఐ దాఖలు చేసిన కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది న్యాయస్థానం. మే 2వ తేదీన ఈ కేసులో తీర్పు వెల్లడి కానుంది. ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Delhi liquor Scam: కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి.. సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్.. ఈడీ కేసులో..
MLC Kavitha
Follow us

|

Updated on: Apr 22, 2024 | 10:01 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సీబీఐ దాఖలు చేసిన కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది న్యాయస్థానం. మే 2వ తేదీన ఈ కేసులో తీర్పు వెల్లడి కానుంది. ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. కవిత తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. విచారణకు సహకరిస్తున్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై పది స్టేట్మెంట్స్ ఇచ్చారని, ఈడీ ఆయనను అరెస్ట్ చేసిందన్నారు. ఈ కేసులో బుచ్చిబాబు నాలుగు స్టేట్ మెంట్‌లు ఇచ్చారన్నారు. ఆ వెంటనే బుచ్చిబాబుకు బెయిల్ ఇచ్చారని తెలిపారు. అదే తరహాలో స్టేట్‌మెంట్ ఇచ్చిన వెంటనే మాగుంట రాఘవకు బెయిల్ వచ్చిందన్నారు. మాగుంట రాఘవ తండ్రికి ఎన్డీయే అభ్యర్థిగా ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. ఇవన్నీ కూడా ఈ కేసులో ముఖ్యమైనవని, పరీశీలనలోకి తీసుకోవాల్సి అంశాలన్నారు. అంతేకాకుండా బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో 60 కోట్ల ఇచ్చిన శరత్‌చంద్రారెడ్డికి ఇదే కేసులో బెయిల్‌ వచ్చిందని తెలిపారు. సాక్ష్యాలు ధ్వంసం చేశారా? సాక్ష్యాలు ధ్వంసం చేశారా? అని జడ్జి కావేరి బావేజా కవిత తరపు న్యాయవాదిని అడిగారు. తాము ఎక్కడా సాక్ష్యాలు ధ్వంసం చేయలేదని సింఘ్వీ సమాధానం ఇచ్చారు. ఈడీకి ఇచ్చిన ఫోన్లలో పని మనుషులకు ఇచ్చినవి ఉన్నాయని తెలిపారు. ఆమె ఫోన్లలో డేటా లభించలేదని ఈడీ తెలిపింది.

సీబీఐ అరెస్ట్ పై కవిత తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహిళగా కవిత బెయల్‌కు అర్హురాలని తెలిపారు. కవిత అరెస్ట్‌కు సరైన ఆధారాలు లేవన్నారు. ఈడీ కస్టడీలో ఉండగానే ఎందుకు సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారని, అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. పార్టీకి కవిత స్టార్ క్యాంపైనర్ అని తెలిపారు. సీబీఐ వాదనలు వినిపిస్తూ.. కవితకు బెయిల్ ఇవ్వొద్దని లిక్కర్ కేసును కవిత ప్రభావితం చేయగలరని సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. లిక్కర్ స్కాంలో కవిత కీలకంగా ఉన్నారని, బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని తెలిపారు.

ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది న్యాయస్థానం .

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..