
కళ్లు మూసి తెరిచేలోగా రోడ్లపై ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మృత్యువేగంతో దూసుకొచ్చిన కారు ఎలాంటి బీభత్సం సృష్టించిందో తెలుసుకుంటే ఒక్కసారిగా షాక్ అవుతారు. అవును.. వాయు వేగంతో దూసుకొచ్చిన కారు.. బీభత్సం సృష్టించింది.. ఈ ప్రమాదకర ఘోర రోడ్డు ప్రమాదం మిర్యాలగూడ శివారులో జరిగింది. అతివేగంతో వచ్చిన కారు బీభత్సం సృష్టించింది. అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై నందిపాడు బైపాస్ దగ్గర ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముందుగా బైక్ నడుపుతూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని, రోడ్డుపక్కన నిలబడిన వ్యక్తిని ఢీకొంది కారు. ఆ తర్వాత రోడ్డుకు అవతలి పక్కనున్న ట్రాక్టర్ మీదకు కారు దూసుకుపోయింది. ఆ ట్రాక్టర్ దగ్గరన్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొన్నది. ట్రాక్టర్ దగ్గరున్న ఇద్దరు వ్యక్తులు ఆ కారు స్పీడుకు ఎగిరిపడ్డారు. వారిలో ఒకరు చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని మైసమ్మకుంట తండాకు చెందిన మెగావత్ మంతగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కళ్ల ముందున్న వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురికావడం చూసి.. అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. ఈ ప్రమాదం స్థానికులు చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు.. అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. స్థానికుల రాస్తారోకోతో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని,స్థానికులతో చర్చలు జరిపి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..