బండి సంజయ్ కి వేముల మరోసారి సవాల్.. ఆ విషయం నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న ప్రశాంత్‌రెడ్డి

|

Feb 03, 2021 | 5:57 PM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి రాష్ట్ర రోడ్డు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మరోసారి సవాల్‌..

బండి సంజయ్ కి వేముల మరోసారి సవాల్.. ఆ విషయం నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న ప్రశాంత్‌రెడ్డి
Follow us on

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి రాష్ట్ర రోడ్డు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మరోసారి సవాల్‌ విసిరారు. బాన్సువాడలో రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాంకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌కి మంత్రి వేముల మరోసారి సవాల్‌ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బుల్లో కేంద్రం ప్రభుత్వ వాటా 200 రూపాయల కంటే మించితే తాను రాజీనామాకు సిద్ధమని మంత్రి సవాల్‌ విసిరారు. తన సవాలు స్వీకరించి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని విమర్శించారు. తెలంగాణకు నిధులు తేవడంలో బీజేపీ నేతలు విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి ఇస్తే ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

 

మరిన్ని ఇక్కడ చదవండి :

ఏ ఒక్కరినీ వదలం.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నామన్న వరంగల్‌ సీపీ

వావిలాలలో ఈటల రాజేందర్‌ ఉద్వేగపూరిత ప్రసంగం.. మరోసారి సంచలనంగా మారిన ఈటల వ్యాఖ్యలు