Telangana: 6 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తాం..గణేష్‌ ఉత్సవాల కోసం రహదారులు సిద్ధం చేస్తామన్న మంత్రి తలసాని

వివిధ శాఖల సమన్వయంతో గణేష్‌ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విగ్రహాల ఊరేగింపు నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు.

Telangana: 6 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తాం..గణేష్‌ ఉత్సవాల కోసం రహదారులు సిద్ధం చేస్తామన్న మంత్రి తలసాని
Minister Talasani Srinivas Yadav

Edited By: Ganesh Mudavath

Updated on: Aug 17, 2022 | 2:01 AM

గణేష్ ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వివిధ శాఖల సమన్వయంతో గణేష్‌ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విగ్రహాల ఊరేగింపు నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. GHMC ఆధ్వర్యంలో 4 లక్షలు, HMDA, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక రెండు లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తామన్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అయితే ఈనెల 31 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రంలో ఉన్న‌తస్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వహించడం జరిగింది. దీనిపై మంత్రి తలసాని అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, MLC ప్రభాకర్ రావు, MLA దానం నాగేందర్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం