Telangana: లోన్ మంజూరైందంటూ ఫోన్ వచ్చింది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. చివరకు..

కాదేదీ మోసానికి అన‌ర్హం.. సైబర్ నేరాలు ఆగటం లేదు.. ప్రతిరోజూ ఏదో ఒక చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వందలు, వేలు కాదు.. ఏకంగా లక్షల్లోనే కొట్టేస్తున్నారు.

Telangana: లోన్ మంజూరైందంటూ ఫోన్ వచ్చింది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. చివరకు..
Loan

Updated on: Mar 26, 2023 | 9:35 AM

కాదేదీ మోసానికి అన‌ర్హం.. సైబర్ నేరాలు ఆగటం లేదు.. ప్రతిరోజూ ఏదో ఒక చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వందలు, వేలు కాదు.. ఏకంగా లక్షల్లోనే కొట్టేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా పరిధిలో ఓ భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో లోన్‌ పేరుతో ఓ వ్యక్తికి కుచ్చుటోపి పెట్టారు సైబర్‌ కేటుగాళ్లు.. ముందు నైస్‌గా 2 లక్షల లోన్‌ మంజూరైందని యువకుడికి ఫోన్‌ చేశారు. ఆ తర్వాత అసలు రంగు బయటపెట్టారు. ఈ లోన్‌ ఇవ్వాలంటే ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ, ఇతర చార్జీల కింద డబ్బులు పంపాలంటూ మెసేజ్‌లు పెట్టారు. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. వారి మాటలు నమ్మిన ఆ వ్యక్తి ప్రొసిడ్ అయ్యాడు.

ఆ వ్యక్తి విడతలవారీగా 85వేలకు వరకు చెల్లించాడు. అయితే ఎంతకి లోన్ రాకపోవడంతో ఆ సైబర్‌ మోసం బయటిపడింది. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. ఆ తర్వాత తనకు జరిగినదంతా చెప్పి.. న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. విడతలవారీగా రూ.85,033 చెల్లించినట్లు యువకుడు వెల్లడించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్త ఉండాలని.. నకిలీ సందేశాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిదని పోలీసులు చెబుతున్నారు. లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..