Mahesh Kumar Goud: అంతా అబద్దమే.. కీలక వ్యాఖ్యలు చేసిన మహేష్‌కుమార్ గౌడ్
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, బీసీల వాటా, కులగణనపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను మంత్రి పదవిని ఆశించడం లేదని, పీసీసీ అధ్యక్ష పదవి ఉన్నతమైనదని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మహేష్ గౌడ్, కాంగ్రెస్ కులగణనను సమర్థించారు, బీజేపీ వైఖరిని విమర్శించారు.
Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీవీ9 “క్రాస్ ఫైర్” కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, రాబోయే సవాళ్లపై విస్త్రతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలోని విభేదాలు, బీసీల ప్రాతినిధ్యం, కులగణన వంటి అనేక అంశాలపై తన స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సహజమని మహేష్ కుమార్ గౌడ్ అంగీకరించారు. “కాంగ్రెస్ పెద్ద పార్టీ, పదవులు తక్కువ ఉన్నప్పుడు కాంపిటీటర్స్ ఎక్కువ ఉంటారు. ఎలిజిబుల్ లీడర్షిప్ పెద్దది ఉంది. నాచురల్లీ గ్రూప్స్ ఉంటాయి. కానీ దాన్ని ఆ గ్రూపులు కూడా కొంత ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణంలోనే ఉంటాయి” అని ఆయన వివరించారు.
తాను ఏ గ్రూపునకు ఆద్యం పోసేవాడిని కాదని, గ్రూపులను ఎంకరేజ్ చేయనని, తాను న్యూట్రల్ ఫేస్‌నని ఆయన స్పష్టం చేశారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీతో కలిసి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు గ్యాప్ ఉందన్న ప్రచారాన్ని “ప్రతిపక్ష పార్టీలు అదే చెప్తాయి” అంటూ కొట్టిపారేశారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, తాము నిరంతరం కలుస్తూ మాట్లాడుకుంటామని తెలిపారు.
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..

