Crime news: కెమెరాకు చిక్కిన మాదన్నపేట్ రెడ్డి సంఘం అధ్యక్షుడు.. అర్ధరాత్రి సమయంలో ఆ పనులు

హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట్(madannapeta) పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా పార్క్‌ చేసిన కార్లు, వాహనాలు ధ్వంసమవుతున్నాయి. అర్ధరాత్రులు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తీరా ఓ రోజు సీసీ కెమెరాలు(CC Camera) చూస్తే అసలు విషయం...

Crime news: కెమెరాకు చిక్కిన మాదన్నపేట్ రెడ్డి సంఘం అధ్యక్షుడు.. అర్ధరాత్రి సమయంలో ఆ పనులు
Madannapeta

Updated on: Apr 06, 2022 | 9:25 PM

హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట్(madannapeta) పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా పార్క్‌ చేసిన కార్లు, వాహనాలు ధ్వంసమవుతున్నాయి. అర్ధరాత్రులు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తీరా ఓ రోజు సీసీ కెమెరాలు(CC Camera) చూస్తే అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు మాదన్నపేట్ రెడ్డి సంఘం అధ్యక్షుడు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ బొక్క భూపాల్ రెడ్డి. అర్ధరాత్రి పూట అందరూ నిద్ర పోయిన తరువాత వాకింగ్(Walking) కోసం బయటకు వచ్చే భూపాల్ రెడ్డి, పార్క్‌ చేసి ఉంచిన కార్లను తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో పూర్తిగా పాడు చేసి తిరిగి ఇంటికెళ్లి పడుకుంటాడు. ఇలా రోజు చేయడం అతని హాబీ. ఇకనైనా పోలీసులు కల్పించుకుని అతని వ్యసనం నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Also Read

Team India: అవమానాలు ఎన్నొచ్చినా బ్యాట్‌తోనే చెక్.. టీమిండియా చరిత్రలో ఈయన రూటే సెపరేటు..

Tamilnadu: చ‌నిపోయాడ‌ని పూడ్చిపెట్టారు.. కట్ చేస్తే.. 24 గంట‌ల్లోనే ఇంటికి తిరిగొచ్చాడు..

Eggs: వేసవిలో గుడ్లు తినడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే