Khammam District: పిడుగు పడి నిట్టనిలువునా కాలిపోయిన కొబ్బరి చెట్టు.. వీడియో

|

May 20, 2023 | 1:32 PM

మండు వేసవిలో అకాల వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. మాములు వాన మాత్రమే కాదు.. ఈదురు గాలులు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా పిడుగు పడి కొబ్బరి చెట్టు నిట్టనిలువునా కాలిపోయింది.

Khammam District: పిడుగు పడి నిట్టనిలువునా కాలిపోయిన కొబ్బరి చెట్టు.. వీడియో
Lightning Strike
Follow us on

మండే ఎండల్లో వర్షాలు కురుస్తున్నాయని కాస్త సంతోషించే లోపే.. గాలి వాన అతలాకుతలం చేస్తుంది. పలు ప్రాంతాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు, పిడుగులు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురిసింది. ఉరుముల థాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలుచోట్ల పిడుగులు కూడా పడ్డాయి.

వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో రాత్రి కొబ్బరి చెట్టు పై భారీ పిడుగు పడింది. చెట్టుపై ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. కొబ్బరి చెట్టుపై మంటలు చూసి స్థానికులు హడలిపోయారు. పిడుగు పడ్డ సమయంలో పరిసరాల్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. అదే సమయంలో ఓ యువకుడు పిడుగుపడి నిలువునా దగ్ధమవుతున్న చెట్టు దృశ్యాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..