KTR: ముందు దానికి సమాధానం చెప్పండి.. పవన్‌ కల్యాణ్‌కు కేటీఆర్‌ కౌంటర్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో జనసేన కొత్త పోటీ చేసేదేముంది.. జనసేనను తెలంగాణ ప్రజలే అడ్డుకున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పిన వ్యక్తి.. దానిపై ముందు క్లారిటీ ఇవ్వాలన్నారు.

KTR: ముందు దానికి సమాధానం చెప్పండి.. పవన్‌ కల్యాణ్‌కు కేటీఆర్‌ కౌంటర్
Ktr Counter To Pawan Kalyan

Updated on: Jun 03, 2026 | 1:33 PM

జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జాతీయవాదం గురించి పవన్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితి తెలంగాణ సమాజానికి పట్టలేదన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పిన వ్యక్తి.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో సభ ఎందుకు పెట్టాలనుకున్నారని ప్రశ్నించారు.

తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేయాల్సిందేముందని.. జనసేనను నేతలెవరూ అడ్డుకోలేదని.. ఆయన్ను అడ్డుకుంది ప్రజలేనని కేటీఆర్ అన్నారు. ప్రాంతీయవాదం, ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని మాట్లాడుతున్న పవన్.. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని తప్పుపడతారా? అని ప్రశ్నించారు.

ఓ సోదరుడిగా ఇంటికొస్తే బిర్యానీ పెడతాం తినిపో.. అంతేకాని తెలంగాణ సెక్రటేరియట్‌లో కూర్చొని పెత్తనం చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు వచ్చి పవన్ కల్యాణ్‌ ఓజీ సినిమా డైలాగ్స్ చెబుతున్నారని.. కానీ ఇక్కడ ఓజీ కేసీఆరే అని కేటీఆర్ అన్నారు.

కేటీఆర్ ఏమన్నారో ఇక్కడ చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us