KTR: యాక్సిడెంట్ బాధితులకు అండగా కేటీఆర్.. తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలింపు!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించి, సాయం అందించారు.

KTR: యాక్సిడెంట్ బాధితులకు అండగా కేటీఆర్.. తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలింపు!
Ktr Humanity

Edited By:

Updated on: Oct 25, 2024 | 5:26 PM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. మార్గమధ్యంలో సిరిసిల్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో జిల్లెల్ల వద్ద జరిగిన యాక్సిడెంట్ ను గమనించారు. వెంటనే స్పందించిన కేటీఆర్, డ్రైవర్‌కు చెప్పి కాన్వాయ్‌ని ఆపించారు. ప్రమాదస్థలిని పరిశీలించి, గాయపడిన వ్యక్తులను తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కావటంతో కేటీఆర్ స్వయంగా అంబులెన్స్‌కు కాల్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారిని హాస్పిటల్‌ను వేగంగా తరలించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ చేసిన పనిని పలువురు ప్రశంసించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us