KCR: ఆంధ్రా ప్రాంతానికి నేను వ్యతిరేకం కాదు.. అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు.. అంటే ఎట్లా..?

ఆంధ్రా ప్రాంతానికి వ్యతిరేకం కాదు.. ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించాం.. ఈ తెలంగాణ వేరు.. నాటి హైదరాబాద్‌ వేరు.. తెలంగాణ వచ్చాక చెరువులను బాగు చేసుకున్నాం.. అంటూ భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రజినీకాంత్‌ లైవ్‌షో విత్ కేసీఆర్‌.. టీవీ9 ఇంటర్వ్యూలో పాల్గొన్న గులాబీ బాస్.. మిషన్‌ కాకతీయ పేరుతో చెరువులను బాగుచేశాం అంటూ పేర్కొన్నారు.

KCR: ఆంధ్రా ప్రాంతానికి నేను వ్యతిరేకం కాదు.. అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు.. అంటే ఎట్లా..?
KCR in TV9 Studio
Follow us

|

Updated on: Apr 23, 2024 | 8:03 PM

ఆంధ్రా ప్రాంతానికి వ్యతిరేకం కాదు.. ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించాం.. ఈ తెలంగాణ వేరు.. నాటి హైదరాబాద్‌ వేరు.. తెలంగాణ వచ్చాక చెరువులను బాగు చేసుకున్నాం.. అంటూ భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రజినీకాంత్‌ లైవ్‌షో విత్ కేసీఆర్‌.. టీవీ9 ఇంటర్వ్యూలో పాల్గొన్న గులాబీ బాస్.. మిషన్‌ కాకతీయ పేరుతో చెరువులను బాగుచేశాం అంటూ పేర్కొన్నారు. అప్పుల గురించి కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ధనిక దేశం అమెరికాకు కూడా అప్పులు ఎక్కువేనని.. ప్రజల ఆకాంక్షలను తీర్చే క్రమంలో అప్పులు అవుతాయన్నారు. బట్టకాల్చి మీద వేయాలని చూస్తున్నారని.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే అంటూ కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన శ్వేతపత్రాలు బోగస్‌ అంటూ పేర్కొన్న కేసీఆర్.. అజ్ఞానంతో కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను దెబ్బకొట్టాలని మోదీ చూశారు.. అప్పులపై పరిమితి విధించింది మోదీనే.. అంటూ కేసీఆర్‌ అన్నారు.

పదేళ్లలో విద్యుత్ వ్యవస్థను దారిలో పెట్టామని టీవీ9తో కేసీఆర్‌ తెలిపారు. భవిష్యత్‌కు కూడా ప్రణాళికలు రచించామని.. పవర్ ప్లాంట్‌లకు శ్రీకారం చుట్టామన్నారు. రూ.13కి యూనిట్‌ కొన్నారని మాట్లాడారు.. లాంగ్‌ టర్మ్‌ కోసం ఛత్తీస్‌గఢ్‌ దగ్గర తీసుకున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే.. 24 గంటల కరెంట్‌ ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. కరెంటు విషయంలో తమ అభివృద్ధిని చూసి దేశమే ఆశ్చర్యపోయిందన్నారు. యూనిట్.. రూ.3.90కి యూనిట్ కొంటే.. అబద్దపు ప్రచారం చేశారన్నారు. అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు.. అంటే ఎట్లా..? బట్టకాల్చి మీద వేయాలని సూస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ చిలిపి రాజకీయ క్రీడ అంటూ పేర్కొన్నారు.

విద్యుత్ కు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వలేదని.. అందుకే కరెంట్ కోతలు అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఉన్న వనరులను వాడుకోవడం చేతకాక మాట్లాడుతున్నారన్నారు. తాము 24 గంటలపాటు కరెంట్ ఇచ్చామని.. మార్కెంట్ లో తెలంగాణ పరువును కాంగ్రెస్ తీసేసిందని కేసీఆర్ వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?