Hyderabad: జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు కొత్తకొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. తాగాజా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నగరంలో లక్కీ డ్రా పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 40 ఏళ బాధితురాలికి వాట్సాప్ ద్వారా పరిచమైన కేటుగాళ్లు ఆమె నుంచి ఏకంగా రూ.42.7లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..
Kbc Lucky Draw Scam

Edited By:

Updated on: Feb 06, 2026 | 12:52 PM

హైదరాబాద్‌ సోమాజిగూడకు చెందిన ఓ మహిళను ‘కేబీసీ లక్కీ డ్రా’ పేరుతో మోసం చేసి రూ.42.7 లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 ఏళ్ల బాధితురాలికి వాట్సాప్ ద్వారా కొందరు వ్యక్తులు సంప్రదించి.. ‘కేబీసీ లక్కీ డ్రాలో రూ.1.3 కోట్లు గెలిచారు’ అంటూ నమ్మించారు. ఆ డబ్బు తీసుకోవాలంటే ప్రాసెసింగ్ ఛార్జీలు, ట్యాక్స్, సెక్యూరిటీ డిపాజిట్ పేర్లతో వరుసగా చెల్లింపులు చేయాలని ఒత్తిడి చేశారు.

బాధితురాలిని నమ్మించేందుకు మోసగాళ్లు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఫొటోలతో ఉన్న ఫేక్ ప్రచార పోస్టర్లు పంపించారు. అంతేకాదు.. ఆమె పేరుపై రూ.1.3 కోట్ల ఎస్‌బీఐ చెక్కు అంటూ నకిలీ డాక్యుమెంట్ పంపి మరింతగా మాయచేశారు. ఇదే సమయంలో సీబీఐ నోటీసు అంటూ మరో నకిలీ పత్రం పంపించి.. క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం రూ.1.15 లక్షలు చెల్లించాల్సిందేనంటూ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. డాక్యుమెంట్లు నిజమేనని నమ్మిన బాధితురాలు.. స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు తెచ్చి.. సెప్టెంబర్ 2023 నుంచి నవంబర్ 2025 వరకు మొత్తం 125 బ్యాంక్ ట్రాన్‌జాక్షన్స్ ద్వారా డబ్బు పంపించినట్లు విచారణలో తేలింది. ఈ మొత్తం వివిధ ఖాతాల్లోకి బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ యాక్ట్‌తో పాటు BNSలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మోసగాళ్లు ఐదు వేర్వేరు మొబైల్ నంబర్లు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. నగదులో మెజార్టీ వంతు ముగ్గురు అనుమానితుల పేర్లపై ఉన్న ఖాతాలకు వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్‌ను తనిఖీ చేసి.. నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.