KK Comments: ఆయన వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.. బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని, బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నన్ని రోజులు నాకు ఒరిగింది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ కారణంగా నా కుటుంబం చీలిపోయిందనే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాంగ్రెస్‌లో ఉండగా సీనియర్‌ని అనే గుర్తింపు ఉండేది.. అదే బీఆర్‌ఎస్‌లో సీనియర్ అనే గానీ.. గుర్తింపు లేదన్నారు. పార్టీ చైర్మన్‌ పదవి అడిగితే ఇవ్వనన్నారు....

KK Comments: ఆయన వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.. బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు
Kk Ktr

Updated on: Apr 13, 2024 | 9:01 PM

బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని, బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నన్ని రోజులు నాకు ఒరిగింది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ కారణంగా నా కుటుంబం చీలిపోయిందనే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాంగ్రెస్‌లో ఉండగా సీనియర్‌ని అనే గుర్తింపు ఉండేది.. అదే బీఆర్‌ఎస్‌లో సీనియర్ అనే గానీ.. గుర్తింపు లేదన్నారు. పార్టీ చైర్మన్‌ పదవి అడిగితే ఇవ్వనన్నారు.. నా కుమారుడు విప్లవ్‌కి ఎమ్మెల్సీ అడిగితే ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్‌ వల్ల పెద్దగా వచ్చిందేమే లేదని చెబుతున్న కేకే.. కేసీఆర్‌ని మాత్రం పొగిడారు. కానీ అదే టైమ్‌లో తనకు అన్యాయం జరిగింది అన్నట్లూ మాట్లాడారు.

అయితే కేకే పార్టీ మారడంపై రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ మారడానికి ఆయన కొన్ని కారణాలూ చెప్పారు. బీఆర్‌ఎస్‌లో తనకు ఏమాత్రం తక్కువ కాలేదని, కాంగ్రెస్‌పై మమకారంతోనే మారానని కూడా అన్నారు. కానీ పార్టీ మార్పు వెనుక కారణాలు వేరే ఉన్నాయా? బీఆర్‌ఎస్‌లో ఎన్నేళ్లు నోరు నొక్కుకుని కూర్చున్నారా? కేకే కుటుంబంలో చీలిక తెచ్చింది ఎవరు? మాటలతో హోరెత్తించగల కేకే కూడా కన్నీరు పెట్టుకుంటారా.. ! టీవీ9 సూపర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చూడండి.