
జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి సమీపంలో చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటనలో యువతితో పాటు మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం మాదాపూర్‌లోని హాస్టల్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 39లోని ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మానస మెడలో ఉన్న బంగారు గొలుసును, యాక్టివా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు లాక్కెళ్లారు. ఈ ఘటనలో యాక్టివా బైక్ నడిపిన యువకుడు నరేంద్ర (23) కాగా, గొలుసు లాగిన యువతి రేవతి (33) అని పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటూ.. సనత్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటారని విచారణలో తేలింది. సీసీ ఫుటేజ్‌లు, యాక్టివా బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టిన క్రైమ్ పోలీసులు.. బైక్ నడిపిన నరేంద్ర ర్యాపిడో డ్రైవర్ అని గుర్తించారు. అతడి ఫోన్ నంబర్ ఆధారంగా వారి కదలికలను ట్రాక్ చేశారు. స్నాచింగ్ అనంతరం నిందితులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని తమ సొంత ఊళ్లకు పారిపోతున్నట్లు సమాచారం అందడంతో.. జూబ్లీహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి బుధవారం మధ్యాహ్నం సూర్యాపేటలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కలిసి జల్సాల కోసం చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
Read: నాటు కోళ్లకు ఈ ఆకులు వేస్తే.. అసలు వైరస్ అన్నదే రాదు..