
ఒకరిని ఎలా మర్డర్ చేయాలి అని గూగుల్‌లో వెతికి ఓ దుండగులు దారుణ హత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగర శివారులోని జీడిమెట్ల పీఎస్ పరధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చింతల్‌లోని అంబేద్కర్ నగర్ నివాసం ఉంటున్న శివారెడ్డి అనే వ్యక్తికి అరుణ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. గత పదేళ్లుగా వీరిద్దరూ కలిస సహజీవనం సాగిస్తున్నారు. అయితే రీసెంట్‌కు అరుణ ఆమె కుమారుడితో కలిసి శివారెడ్డిని గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసింది. అనంతనం మృతదేహాన్ని ఆటోలో తరలిస్తూ పోలీసులకు దొరికిపోయింది. దీంతో ఈ దారుణానికి పాల్పడిన తల్లి, కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్లపల్లి అరుణ అనే మహిళ మృతుడు శివ రెడ్డి 8-10 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారని.. గత 10 నెలలుగా వారు చింతల్‌లో కలిసి నివసిస్తున్నారని తెలిపారు. మృతుడు మద్యానికి బానిసై తరచుగా అరుణ, ఆమె కుమారుని పై శారీరక హింస, వేధింపులకు పాల్పడే వాడని.. దీంతో అతన్ని అడ్డుతొలగించాలనుకున్న వారు.. పథకం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో నిద్రపోతున్న బాధితుడిపై కత్తితో దాడి చేసి హతమార్చినట్టు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారన్నారు.
అయితే హత్య ఎలా చేయాలి అని అరుణ కుమారుడు సాయి రత్నం గూగుల్‌లో వెతికినట్టు పోలీసులు గుర్తించారు. ఒక స్థానిక చికెన్ దుకాణం నుండి తప్పుడు సాకులతో కత్తిని కొన్నాడని. హత్య అనంతరం, నిందితుడు రక్తపు మరకలను శుభ్రం చేసి, వారి బట్టలను సమీపంలోని మురుగు కాలువలోపారవేసి , మృతదేహాన్ని ఒక చాప, ప్లాస్టిక్ సంచిలో చుట్టి, నిర్మానుష్య ప్రదేశంలో పారవేయడానికి సిద్ధం చేసినట్లుగా పోలీసులు ధ్రువీకరించారు.జీడిమెట్ల పోలీసులు సత్వరమే స్పందించడంతో మృతదేహాన్ని పారవేసే పథకం భగ్నమైందని.. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు కుత్బుల్లాపూర్ DCP తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.