Hyderabad: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డీజీగా అనిల్ కుమార్..

Telangana IB: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్

Hyderabad: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డీజీగా అనిల్ కుమార్..
Telangana Govt

Updated on: Aug 24, 2021 | 10:29 PM

Telangana IB: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్‌ను నియమించింది. ప్రస్తుతం ఐబీ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్ రావు రిలీవ్ అవుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో అనిల్ కుమార్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గవర్నర్ అనుమతులతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అనిల్ కుమార్.. ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఈ బదిలీ వెనుక ఇతర కారణాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

Also read:

Trivikram Srinivas: ఆ సినిమా చూసిన తర్వాతే సుశాంత్‌ను నా సినిమాలోకి తీసుకున్నా.. త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్

Adilabad: అడవి తల్లుల గోస.. ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం.. టీవి9 వరుస కథనాలకు స్పందన..

భలే మంచి చౌక బేరము.. రూ.86కే ఇల్లు మీ సొంతం.. క్యూ కడుతున్న జనాలు.. ఎక్కడంటే..