
అప్పటి వరకు సాధారణంగా ఉన్న వ్యక్తి సైతం ఒక్కసారి సర్పంచ్‌గా గెలిస్తే తమ రూపురేఖలనే మార్చుకుంటారు. కానీ ఇక్కడో సర్పంచ్ మాత్రం అందుకున్న బిన్నంగా గ్రామపంచాయతీ కార్మికునిగా మారి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ గ్రామ ప్రజలతో మమేకమై తానే గ్రామపంచాయతీ పారిశుద్ధ ట్రాక్టర్ డ్రైవర్‌గా, పారిశుద్ధ్య కార్మికునిగా మారాడు. ఇల్లు ఇల్లు తిరుగుతూ చెత్తను సేకరిస్తూ తడి, పొడి చెత్త పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామసర్పంచ్ వినీష్.
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామానికి చెందిన వినీష్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంగ్‌గా ఎన్నికయ్యారు. తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సర్పంచ్ అంటే సంతకాలు పెట్టేవాడు కాదని గ్రామంలో ఏ సమస్య ఉన్న తానే ముందుండి నడిపించేవాడని నిరూపిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం గ్రామంలో తానే గ్రామపంచాయతీ ట్రాక్టర్ నడుపుతూ పారిశుద్ధ్య కార్మికునిగా మారి ఇల్లు ఇల్లు తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నాడు. గ్రామస్తులకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను సైతం తీస్తూ అందరి మన్నలను అందుకుంటున్నాడు. గ్రామంలో ఏచిన్న సమస్య వచ్చినా అన్నితానై ముందుండి నడిపిస్తున్నాడు. తాను ప్రజాసేవ కోసం సర్పంచ్ గా గెలిచానని.. ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉండి వారికి సేవ చేయడమే తన ధ్యేయమంటున్నాడు సర్పంచ్ వినీష్
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.