ఇందిరమ్మ ఇండ్ల టవర్స్: క్యూర్​ పరిధిలో ఊరిస్తున్న అదృష్టం..నవంబర్ 4న మళ్లీ లక్కీ డ్రా!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటి విడత లాటరీలో ఫ్లాట్లు పొందిన పలువురు లబ్ధిదారులు మొదటి వాయిదా డబ్బులు చెల్లించలేక వెనక్కి తగ్గడం, దరఖాస్తుల్లో నియోజకవర్గాల తప్పులు నమోదు కావడంతో అనేక ఫ్లాట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఖైరతాబాద్‌లో అత్యధికంగా ఫ్లాట్లు మిగలగా, ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నవంబర్ 4న ఆన్‌లైన్ మాప్-అప్ లాటరీ నిర్వహించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్: క్యూర్​ పరిధిలో ఊరిస్తున్న అదృష్టం..నవంబర్ 4న మళ్లీ లక్కీ డ్రా!
Indiramma Towers

Updated on: Nov 02, 2026 | 9:30 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదటి విడత ఆన్‌లైన్ ఈ-లాటరీలో ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులు చివరి క్షణంలో వెనక్కి తగ్గుతుండటంతో ప్రభుత్వం మరోసారి లాటరీ నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఫ్లాట్లు వచ్చినవారు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు?

ప్రతి నియోజకవర్గానికి 480 ఫ్లాట్ల చొప్పున ప్రభుత్వం పారదర్శకంగా తొలి విడత కేటాయింపులు జరిపినప్పటికీ, అనేక ఫ్లాట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఫ్లాట్ పొందిన తర్వాత చెల్లించాల్సిన మొదటి వాయిదా సొమ్మును కట్టలేక నిరుపేద లబ్ధిదారులు చేతులెత్తేశారు. అలాగే, దరఖాస్తు సమయంలో నియోజకవర్గాలు తప్పుగా నమోదు కావడంతో కొందరిని అధికారులు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా ఫ్లాట్లు ఖాళీ కాగా, శేరిలింగంపల్లి లాంటి ప్రాంతాల్లో మాత్రం దాదాపు అన్ని ఫ్లాట్లకు లబ్ధిదారులు సెటిల్ అయ్యారు.

నవంబర్ 3, 4 తేదీల్లో ఈ-లాటరీ ప్రక్రియ

మిగిలిపోయిన ఫ్లాట్లను అర్హులైన మిగతా దరఖాస్తుదారులకు కేటాయించేందుకు హౌసింగ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నవంబర్ 3న కొత్త నియోజకవర్గాలు ముషీరాబాద్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లో ప్రాథమిక పరిశీలన పూర్తయిన దరఖాస్తుదారులకు కొత్తగా ఆన్‌లైన్ ఈ-లాటరీ నిర్వహిస్తారు. నవంబర్ 4న మాప్-అప్ లాటరీలో భాగంగా తొలి విడత 16 నియోజకవర్గాల్లో మిగిలిన ఖాళీల కోసం ఇప్పటికే ఉన్న అర్హుల జాబితా, వెయిటింగ్ లిస్ట్ ఆధారంగా మాప్-అప్ డ్రా చేపడతారు.

ఇవి కూడా చదవండి

సాంకేతికతతో పారదర్శకత – లైవ్ స్ట్రీమింగ్

దరఖాస్తుల్లో నియోజకవర్గాలు తప్పుగా నమోదైన వారి కోసం జియోకోడింగ్, గూగుల్ మ్యాప్స్ ద్వారా సరిచూసి అర్హులకు మాప్-అప్ లాటరీలో అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తంలో పారదర్శకత కోసం నవంబర్ 3, 4 తేదీల్లో జరిగే లాటరీలను హౌసింగ్ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దరఖాస్తుదారులు ఇళ్ల నుంచే తమ అదృష్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us