Rain Alert In Telangana: తెలంగాణలో నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వర్షం కురిసే అవకాశం.

Rain Alert In Telangana: గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఎడతెరపి లేకుండా పడుతోన్న వర్షాలకు రాష్టం తడిసి ముద్దయింది. భారీగా వరద నీరు...

Rain Alert In Telangana: తెలంగాణలో నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వర్షం కురిసే అవకాశం.
Heavy Rains In Telangana
Follow us

|

Updated on: Jul 24, 2021 | 5:38 AM

Rain Alert In Telangana: గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఎడతెరపి లేకుండా పడుతోన్న వర్షాలకు రాష్టం తడిసి ముద్దయింది. భారీగా వరద నీరు చేరడం, ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో ప్రాజెక్టులన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. ఇక వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఏర్పడిన అల్పపీడనం బలపడి శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారడంతో భారీ వర్షాలు కురిశాయి.

ఇదిలా ఉంటే తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనబడడం లేవు. వచ్చే రెండు రోజులు (శనివారం, ఆదివారం) కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ కారణంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. మిగతా చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం వరునుడు కాస్త శాంతించనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదారాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: Traffic Advisory: ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి.. శంషాబాద్ వెళ్లే సర్వీస్ రోడ్డు మూసివేత.. వివరాలివే

Telangana Corona: తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఎన్నంటే..

RTC Bus Fire: మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. 25 మంది ప్రయాణికులు సేఫ్..