Hyderabad: లిక్కర్ తాగితే ఇలా కూడా చేస్తారా.? అర్ధరాత్రి మందుబాబు ఏం చేశాడో తెలుసా..!
అర్ధరాత్రి హైటెన్షన్ స్థంభంపై వ్యక్తిని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని కిందకి దించేందుకు ముప్పుతిప్పలు పడ్డారు.
అర్ధరాత్రి హైటెన్షన్ స్థంభంపై వ్యక్తిని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని కిందకి దించేందుకు ముప్పుతిప్పలు పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి మీర్‌పేట్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద మద్యం మత్తులో హై టెన్షన్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కేసాడు. విద్యుత్ స్తంభంపై అతడిని గమనించిన స్థానికులు కిందకి దిగమని చెప్పినా అతను దిగలేదు. చేసేదిలేక వారు పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని కిందకి దిగమని ఎంత చెప్పినా వినలేదు. రెండు గంటలపాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. అతన్ని కిందకి దించడానికి ముప్పు తిప్పలుపడ్డారు. ఈ క్రమంలో స్థానికంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చివరికి పోలీసులే విద్యుత్ స్తంభంపైకి ఎక్కి మందుబాబును జాగ్రత్తగా కిందకు దించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

