Moinabad Case: మొయినాబాద్‌ కేసు మిస్టరీ వీడింది.. డిప్రెషన్‌తో ఇంటి నుంచి వచ్చిన యువతి..

మొయినాబాద్‌ యువతి మృతి కేసును పోలీసులు చేధించారు. డిప్రెషన్‌తో యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. ఇటు హబీబ్‌నగర్‌ పోలీసుల నిర్లక్ష్యంపై సీపీ సీరియస్‌ అయ్యారు. ఎస్సై శివను సస్పెండ్ చేశారు.

Moinabad Case: మొయినాబాద్‌ కేసు మిస్టరీ వీడింది.. డిప్రెషన్‌తో ఇంటి నుంచి వచ్చిన యువతి..
Crime News

Updated on: Jan 13, 2024 | 7:58 AM

హైదరాబాద్‌ నగర శివారు మొయినాబాద్‌లో యువతి మృతి కేసులో మిస్టరీ వీడింది. యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. మృతురాలు తహసీన్ బేగంగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితం స్నేహితురాలితో తహసీన్‌కు గొడవ జరిగిందని.. పలు కారణాల వల్ల డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల నిర్ధారించారు. గతంలోనూ యువతి తహసీన్ బేగం ఆత్మహత్యకు యత్నించిందన్నారు. ఈనెల 8న ఉదయం 11:30కి ఇంటి నుంచి బయల్దేరిన తహసీన్.. మధ్యాహ్నం స్నేహితులను కలిసిన తర్వాత మల్లేపల్లి నుంచి ఆటోలో మొయినాబాద్‌కు వచ్చింది. రాహిల్ అనే స్నేహితుడికి యువతి చివరి కాల్ చేసిందన్నారు. యువతి డిప్రెషన్‌లో ఉన్నట్టు రాహిల్ చెప్పాడని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు కూడా తహసీన్ చెప్పిందన్నారు.

ఆత్మహత్య చేసుకుంటునట్లు వాట్సాప్ స్టేటస్‌ కూడా పెట్టుకున్నట్లు గుర్తించారు. అయితే, ఆటో డ్రైవర్‌తో పాటు స్నేహితుడిని ప్రశ్నించడంతో ఈ విషయాలు బయటికొచ్చాయి. మరోవైపు ఈ కేసులో హబీబ్‌నగర్‌ పోలీసుల నిర్లక్ష్యం వహించారని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హబీబ్‌నగర్‌ ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్సై శివను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10న మృతురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు యువతి మిస్సింగ్‌ కేసు కూడా నమోదు చేయకపోవడంతో చర్యలు తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..