ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) మరో శుభవార్త చెప్పింది. వివిధ పనుల నిమిత్తం రాత్రి సమయాల్లో నగరానికి చేరుకునే వారు.. గమ్యస్థానాలకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాత్రి సమయాల్లోనూ బస్సులు నడపాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. దేశంలోని మహానగరాల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న మహానగరాల్లో హైదరాబాద్(Hyderabad) ఒకటి. చాలా అంశాల్లో మిగిలిన మహానగరాలకు తీసిపోని రీతిలో ఉంది. మహానగరం ట్యాగ్ ఉన్నప్పటికీ హైదరాబాద్ లో రాత్రి వేళలో ప్రజా రవాణా విషయంలో ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఇంత పెద్ద సిటీలో అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి తెల్లవారుజాము వరకు పరిమిత సంఖ్యలో బస్సుల్ని తిప్పితే లాభం కలుగుతుందని భావించిన ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. నైట్ రైడర్స్ పేరుతో ఆర్టీసీ బస్సుల్ని అర్థరాత్రి దాటిన తర్వాత తిప్పే ప్రయత్నంలో భాగంగా తొలి అడుగు పడింది.
Timings of #TSRTCNightServices in #Hyderabad @puvvada_ajay @Govardhan_MLA @tsrtcmdoffice @TV9TeluguLive @way2_news @baraju_SuperHit @TarakSpace @dineshakula @NewsmeterTelugu @CoreenaSuares2 @TheNaveena @syedmohammedd #Telangana @anusha_puppala @DigitalMediaTS @TelanganaToday pic.twitter.com/JAwMtS3ixf
ఇవి కూడా చదవండి— TSRTC (@TSRTCHQ) May 26, 2022
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అర్థరాత్రి 12.15 గంటలకు బయలుదేరు ఆర్టీసీ బస్సు పటాన్ చెరు వరకు వెళుతుంది. ఈ రూట్ లు పలు ప్రత్యేక ట్రిప్పుల్ని తిప్పుతారు. దీనికి వచ్చే ఆదరణను చూసిన తర్వాత మిగిలిన రద్దీ రూట్లలో అర్థరాత్రి వేళ బస్సుల్ని తిప్పాలని భావిస్తోంది. సికింద్రాబాద్ – పటాన్ చెరు, పటాన్ చెరు – సికింద్రాబాద్ సికింద్రాబాద్ – చార్మినార్, చార్మినార్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – సీబీఎస్, సీబీఎస్ – సికింద్రాబాద్ మధ్య ట్రిప్పులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి