తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్‌కు వయస్సు 67 సంవత్సరాలు. దీనితో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలతో పాటు ప్రముఖులందరూ కూడా సంతాపం తెలిపారు.
సుష్మాస్వరాజ్ మృతి పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు చిన్నమ్మ చేసిన గొప్ప పనిని ఎప్పటికి మర్చిపోరంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
Heartfelt condolences on the demise of former Union Minister Smt #SushmaSwaraj Ji. Telangana people will forever remember her support to the statehood cause. RIP Chinnamma ??
— KTR (@KTRTRS) August 6, 2019