Hyderabad: విమాన రాకపోకలకు అంతరాయం.. కొన్ని ఫ్లైట్స్ దారి మళ్లింపు.. ఎందుకంటే..

|

Apr 21, 2022 | 10:34 PM

హైదరాబాద్‌లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ఈ ప్రభావం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై(shamshabad international airport) పడింది. దీంతో విమానాలు దిగేందుకు వాతావరణం..

Hyderabad:  విమాన రాకపోకలకు అంతరాయం.. కొన్ని ఫ్లైట్స్ దారి మళ్లింపు.. ఎందుకంటే..
Flights
Follow us on

హైదరాబాద్‌లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ఈ ప్రభావం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై(shamshabad international airport) పడింది. దీంతో విమానాలు దిగేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఇప్పటికే నాలుగు విమానాలను దారి మళ్లించారు. రెండు ఇండిగో విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించగా.. ఢిల్లీ, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు మళ్లించారు. వర్షం వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన పలు విమానాలను మళ్లించారు. రెండు ఇండిగో విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టుకు అధికారులు మళ్లించారు. ఢిల్లీ, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగుళూరుకు మళ్లించారు.

గచ్చిబౌలి, షేక్‌పేట్, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌సిటీ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌లో వర్షం కురిసింది. యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, చైతన్యపురి, ఉప్పల్‌లో వర్షం పడింది. దీంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

కాగా.. గత కొన్నిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతోన్న హైదరాబాద్ వాసులపై వాతావరణం కాస్త దయ చూపింది. గురువారం మధ్యాహ్నం నుంచి నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆ వెంటనే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని కొండాపూర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపరి, కొత్తపేట, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేట్‌, మలక్‌పేట ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అలాగే చాంద్రాయణగుట్ట, బార్కాస్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఈదురుగాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి: AP: ఫీజు కట్టాలంటూ అందరి ముందు అవమానించారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారులు..

Rain: హైదరాబాద్‌లో ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షం.. నగరవాసులకు కాస్త ఉపశమనం..