
తోటి విద్యార్థి వేధింపులకు తట్టుకోలేక 10వ తరగతి విద్యార్థిని ఆత్మత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కుంట్లూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలిక, అదే స్కూల్‌కు చెందిన ఓ బాలుడితో పరిచయం పెంచుకుంది. అయితే ఆ స్నేహాన్ని దుర్వినియోగం చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ బాలుడు ఆమెను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. పలుమార్లు మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, అతని నుంచి వేధింపులు పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన విద్యార్థిని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఇంట్లోని ఫ్యాక్‌కు ఉరివేసుకుని బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన బాలికను చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మృతదేహాన్ని తమ సొంత గ్రామానికి తీసుకెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, సాగర్ ప్రాంతం నుంచి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తిరిగి హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో ప్రాంతంలో ఆవేదన నెలకొనగా.. విద్యార్థుల భద్రత, సామాజిక మాధ్యమాల్లో వేధింపులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పిల్లల సోషల్ మీడియా వినియోగం పట్ల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కౌమర దశలో వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారని.. వారిని కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు టీచర్స్‌పై ఉంటుందంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.