Viral: ఒరేయ్ ఎవర్రా మీరంతా.. చాక్లెట్ బాక్సులతో ఫ్లైట్ దిగిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే..

|

Nov 01, 2024 | 3:51 PM

ఎన్ని దాడుల జరుగుతున్నా.. ఎన్ని కేసులు నమోదవుతున్నా.. శిక్షలు పడుతున్నా.. స్మగ్లర్ల తీరు మాత్రం మారడం లేదు.. రోజుకో రూటు మార్చుతూ.. అధికారులకు చిక్కకుండా సరికొత్త మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు.. తాజాగా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.. చాక్లెట్‌ ప్యాకెట్లలో భారీగా డ్రగ్స్ ను గుర్తించారు అధికారులు..

Viral: ఒరేయ్ ఎవర్రా మీరంతా.. చాక్లెట్ బాక్సులతో ఫ్లైట్ దిగిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే..
Crime News
Follow us on

బ్యాంకాక్‌ నుంచి ఇద్దరు ఫ్లయిట్ లో హైదరాబాద్‌ వచ్చారు. మంచిగా.. వారి బ్యాగుల్లో చాక్లెట్స్ పాకెట్స్, స్వీట్ బాక్సులు ఉన్నాయి.. ఎందుకో వారిపై అనుమానం వచ్చింది.. దీంతో పోలీసులు ఆపి వారిని తనిఖీ చేశారు.. బ్యాగుల్లో కెల్లాగ్స్ చాక్లెట్ ప్యాక్, బాక్సులు ఉన్నాయి.. దీంతో ఇంకా అనుమానం వచ్చింది.. ఆ ప్యాకెట్లలో ఏమున్నాయో అంటూ ఓపెన్ చేశారు.. ఇంకెముంది.. దెబ్బకు అంతా షాకయ్యారు.. వాటిల్లో కోట్లు విలువ చేసే డ్రగ్స్ ఉండటం చూసి అంతా స్టన్ అయ్యారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది.. సుమారు రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకోవడం సంచలనంగా మారింది.

Shamshabad Airport

బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న వచ్చిన ఇద్దరు భారతీయుల లగేజ్‌ లో ఏదో అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేయగా తినే పదార్థం కెల్లాగ్స్ చాకోస్ 13 ప్యాకెట్లలో హైడ్రోపోనిక్‌ గంజాయి రావాణా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది.. వారి నుంచి ఏడు కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ రూ. 7 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

వీడియో చూడండి..

డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. నిందితులపై 1985 ఎన్డీపీఎస్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.. కాగా, హైడ్రోపోనిక్ గంజాయి అత్యంత ప్రమాదకరమైనది. డ్రగ్స్ కంటే కూడా విలువైన, ఖరీదైన గంజాయిగా చెబుతుంటారు.. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇది తయారవుతుందని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..