పాపం ప్రియాంక.. ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్.. రాజమండ్రి మెడికో హెల్త్ అప్డేట్ ఇదే..

రాజమండ్రిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుండగా, వైద్యులు బ్రెయిన్‌డెడ్ పరిస్థితిపై కుటుంబ సభ్యులకు వివరించినట్లు సమాచారం. చివరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్ నిర్వహించేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉండటంతో ముందుగా వాటిని నియంత్రించాల్సి ఉందని తెలుస్తోంది.

పాపం ప్రియాంక.. ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్.. రాజమండ్రి మెడికో హెల్త్ అప్డేట్ ఇదే..
Medico Priyanka Health Update

Updated on: Aug 08, 2026 | 1:43 PM

పాపం ప్రియాంక.. రాజమండ్రిలో కారు యాక్సిడెంట్‌లో తీవ్రగాయాలపాలై.. హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చావుకి బతుకుకీ మధ్య పోరాడుతోంది. వన్ పర్సంట్ హోప్ ఉంటే చాలు.. బతికించుకోడానికి ప్రాణాలు పణంగా పెట్టేందుకు కుటుంబం సిద్దంగా ఉంది. కానీ ఆల్మోస్ట్‌ హోప్‌లెస్ అని డాక్టర్లు చెప్పడం ఆ కుటుంబానికి ఎటూపాలుపోని పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు ప్రియాంక హెల్త్ కండీషన్ ఏంటి..? అనే వివరాలను తెలుసుకుందాం.. పగవాడికి కూడా రాకూడదు అనిపించే కష్టం ఆ కుటుంబానికి వచ్చింది. కళ్లముందు ఐసీయూలో కన్నబిడ్డ ఉంది. శరీరానికి ప్రాణం ఉంది. కానీ మెదడు మాత్రం పని ఆపేసింది. ఆమెను చూసి కన్నీళ్లు పెట్టుకునే కళ్లు తప్ప.. ఆమె కళ్లు తెరిచి చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు హోప్‌లెస్ అన్నట్లుగా చెబుతున్న వైద్యులు.. మరోవైపు మిగిలి ఉన్న చిన్న ఆశతో మళ్లీ కూతురు కళ్లు తెరవకపోతుందా, ఏ దేవుడైనా కరుణించి అద్భుతం చేయకపోతాడా అన్నట్లు తల్లిదండ్రుల ఆశ. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సలో ఉంది ప్రియాంక. ఆ ఆస్పత్రికి చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో వచ్చేవాళ్లే. కానీ వాళ్లందరూ కూడా వాళ్ల బాధలకంటే ప్రియాంక కుటుంబం పడుతున్న వేదనకు చలించిపోతున్నారు. ఆమె బతకాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్

ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రియాంకకు చికిత్స కొనసాగుతోంది. దాదాపు బ్రెయిన్‌డెడ్ కండీషన్ అని వైద్యులు పేరెంట్స్‌కి చెప్పారు. శరీరానికి, మెదడికి మధ్య నరాల వ్యవస్థ తెగిపోయింది. ఆఖరి ప్రయత్నంగా వైద్యులు అప్నియా టెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రియాంక శరీరంలో సోడియం లెవల్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోడియం లెవల్స్‌ తగ్గితేనే టెస్ట్ నిర్వహణ సాధ్యం అని వైద్యులు పేర్కొంటున్నారు. టెస్ట్‌, రిజల్ట్ తర్వాత మాత్రమే ప్రియాంక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఏ దేవుడైనా అద్భుతం చేయకపోతాడా అన్నట్లు తల్లిదండ్రుల్లో ఆశ నెలకొంది..

అప్నియా టెస్ట్అ -నేది రెండు వేర్వేరు వైద్య సందర్భాలలో ఉపయోగించే ముఖ్యమైన పరీక్ష

మొదటిది నిద్రలో శ్వాస ఆగిపోయే సమస్యను నిర్ధారించే స్లీప్ అప్నియా టెస్ట్ కాగా, రెండవది అత్యవసర వైద్యంలో మెదడు మరణాన్ని (Brain Death) నిర్ధారించడానికి చేసే నిర్దిష్ట పరీక్ష..

రిమాండ్‌లో నిందితులు..

ప్రస్తుతం 14రోజుల రిమాండ్‌లో ఉన్నారు దశ్వంత్‌, జోసెఫ్‌.. ఘటన జరిగిన రోజు నిందితులపై BNS BNS 134/U, 125(b) సెక్షన్లు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ అన్నట్లుగా తొలిరోజు కేసు పెట్టిన పోలీసులు.. ప్రియాంక పరిస్థితి విషమించడంతో సెక్షన్లు మార్చారు. ప్రస్తుతం BNS 110 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. తెలిసీ, ఉద్దేశపూర్వకంగా ప్రమాదం చేసినట్లుగా సెక్షన్లు మార్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us