సెప్టెంబర్ 17న తెలంగాణలో భారీ సభను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విమోచన దినోత్సవ సభకు అమిత్‌షా వస్తారని చెప్పారు. మజ్లిస్ ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావటమే తమ లక్ష్యమని కిషన్‌రెడ్డి చెప్పారు. అయోధ్య విషయం కోర్టు పరిధిలో ఉందన్నారు. కశ్మీర్ విభజన విషయంలో మెజార్టీ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. 370 రద్దును రాజకీయం చేయాలని కాంగ్రెస్ చూసిందన్నారు.