
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ముందుగా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీకి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి HICCకి బయలుదేరి వెళ్లారు. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువతో సత్కరించి జ్క్షాపికను బహుకరించారు. అనంతరం కాకతీయ టెక్స్‌టైల్‌ను ప్రారంభించారు. అలాగే గుడెబలలూర్-మహబూబ్‌నగర్ 4 లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్‌గా మోదీ శంకస్థాపన చేశారు. రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. సైబరాబాద్ అభివృద్దికి కేంద్రం వేలాది కోట్లు కేటాయించిందని మోదీ అన్నారు. సైబరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఇప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులతో వేలాది ఉద్యోగాలు వస్తాయని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి,మోదీ మధ్య HICCలో సున్నితమైన సంవాదం జరిగింది. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్‌కి ఎలా ఇచ్చారో అలా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానిని కోరారు. అయితే దీనికి మోదీ స్పందిస్తూ గుజరాత్‌కి ఆ రోజు ఎంత ఇచ్చారో ఇప్పుడు తెలంగాణకుఅంత ఇస్తే.. వచ్చేది మేము ఇవ్వాలనుకుంటున్నదానిలో సగమే వచ్చే అవకాశం ఉందని మోదీ అన్నారు.
ఆ రోజు గుజరాత్‌కి చేసిన కేటాయింపులకు రెట్టింపు అని, తెలంగాణకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అందుకే మాతో కలవండి అంటూ రేవంత్‌రెడ్డికి నవ్వుతూ ప్రధాని మోదీ సలహా ఇచ్చారు.