Hyderabad Power Cuts: హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్.. పవర్ ‘కట్’ స్టార్ట్.. ఎక్కడెక్కడ.? ఎన్ని గంటలంటే.?

|

Jan 17, 2024 | 5:08 PM

హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్. నగరంలో పలు చోట్ల.. బుధవారం నుంచి పవర్ 'కట్‌'లు మొదలయ్యాయి. ఈ విషయాన్ని టీఎస్‌ఎస్‌ఏపీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొనడంతో పాటు.. విద్యుత్ సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లోనూ భాగ్యనగరంలో ఎక్కడెక్కడ.. ఎన్ని గంటలు..

Hyderabad Power Cuts: హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్.. పవర్ కట్ స్టార్ట్.. ఎక్కడెక్కడ.? ఎన్ని గంటలంటే.?
Power Cuts In Hyderabad
Follow us on

హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్. నగరంలో పలు చోట్ల.. బుధవారం నుంచి పవర్ ‘కట్‌’లు మొదలయ్యాయి. ఈ విషయాన్ని టీఎస్‌ఎస్‌ఏపీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొనడంతో పాటు.. విద్యుత్ సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లోనూ భాగ్యనగరంలో ఎక్కడెక్కడ.. ఎన్ని గంటలు పవర్ కట్ అవుతుందన్న విషయాన్ని కూడా వెల్లడించింది. నగరంలో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు రెండేసి గంటల పాటు కరెంట్ కోతలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆదివారాలు, పండుగ దినాల్లో తప్ప.. మిగిలినన్ని రోజులు ఈ పవర్ కట్ షెడ్యూల్ అమలవుతుంది.

ఈ కరెంట్ కోతల షెడ్యూల్‌పై ట్విట్టర్‌లో పేర్కొన్న టీఎస్‌ఎస్‌ఏపీడీసీఎల్‌ ఎండీ ముషారఫ్.. వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగానే ఈ కోతలని చెప్పారు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్లకొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్తవాటిని వేయడం వంటివి ఉంటాయని.. నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు. పవర్ కట్స్ ఉంటాయని చెప్పినంత మాత్రాన ప్రతిరోజూ ఉండవని, ఒక్కో ఫీడర్‌లో ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3 వేల ఫీడర్లు ఉన్నాయని, ఆయా ఫీడర్ల పరిధిలో రెండు గంటలు కోతలు ఉంటాయని తెలిపారు. సమ్మర్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం నవంబర్-జనవరి మధ్య వార్షిక నిర్వహణ పనులు ఉంటాయని, కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవి ఆలస్యమైనట్టు ఫారూఖీ వివరించారు.

జనవరి 17 కరెంట్ కోతల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..