Metro Trains: మెట్రో బాట పట్టిన భాగ్యనగర వాసులు.. ఆర్టీసీ చార్జీల మోతతో పెరిగిన రద్దీ..

|

Apr 18, 2022 | 5:02 PM

Hyderabad Metro Trains Rush: మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్టీసీ ఛార్జీలతో నగరంలో ప్రయాణం ఇబ్బందిగా మారింది. దీంతో పాటు సమ్మర్ వేడి కూడా మొదలవడంతో జనం మెట్రో బాట..

Metro Trains: మెట్రో బాట పట్టిన భాగ్యనగర వాసులు.. ఆర్టీసీ చార్జీల మోతతో పెరిగిన రద్దీ..
Hyderabad Metro Trains Rush
Follow us on

మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్టీసీ ఛార్జీలతో నగరంలో ప్రయాణం ఇబ్బందిగా మారింది. దీంతో పాటు సమ్మర్ వేడి కూడా మొదలవడంతో జనం మెట్రో బాట (Hyderabad Metro Trains ) పడుతున్నారు. కరోనా(Covid-19) మిగిల్చిన నష్టం నుంచి ఇప్పుడిప్పుడే అన్ని రంగాలూ బయటపడుతున్నాయి. లాక్ డౌన్ తో కుదేలైన మెట్రో కూడా ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. కరోనాకు ముందు రోజుకి నాలుగు లక్షల మంది మెట్రోలో ప్రయాణించేవారు. ప్రస్తుతం రోజుకి దాదాపు మూడు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరో వైపు ఆర్టీసీ చార్జీలు పెరగడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మెట్రోను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ధరలతో పాటు ఎండల తీవ్రత వల్ల సొంత వాహనాల వాడకాన్ని తగ్గిస్తున్నారు నగరవాసులు.

మొన్నటి వరకు కరోనా వల్ల వర్క్‌ ఫ్రం హోం చేశారు ఐటీ ఉద్యోగులు. వారిని ఆఫీసులకు రావాలని చెబుతున్నాయి కంపెనీలు. ఇది కూడా మెట్రో రద్దీ పెరగడానికి ఓ కారణం. దీనికి తోడు మెట్రో స్సెషల్‌ ఆఫర్స్‌ పెట్టింది. దీంతో వర్కింగ్ డేస్‌తో పాటు వీకెండ్‌లో కూడా మెట్రో రైళ్లు రద్దీగా ఉంటున్నాయి.

మరింత వేగంగా ప్రయాణించనున్న హైదరాబాద్‌ మెట్రో రైళ్లు.. ప్రయాణ సమయం ఆదా

హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల వేగం పెంపునకు CMRS‌ అనుమతి ఇవ్వడంతో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇది రైళ్ల వేగం పెరగడంతో ప్రయాణికులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. గంటకు 70 కి.మీ నుంచి 80 కి.మీకి స్పీడ్ పెంచుకునేందుకు పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. మెట్రో రైళ్ల వేగం, భద్రతపై మార్చి 28,29,30న తనిఖీలు చేశారు. తనిఖీల అనంతరం కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్వే సేఫ్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. మెట్రో రైళ్ల వేగం పరిమిత పెంపుతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. నాగోల్‌-రాయదుర్గం మధ్య 6 నిమిషాలు.. మియాపూర్‌-ఎల్బీనగర్‌ మధ్య 4 నిమిషాలు…. జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మధ్య ఒకటిన్నర నిమిషం ఆదా అవుతుంది.

ఇవి కూడా చదవండి: Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..