బ్రేకింగ్: విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి చెందాడు. విజయారెడ్డిని తగలబెడుతూ తీవ్రంగా గాయపడ్డ సురేష్ ఆ తరువాత కాలిన గాయాలతోనే పోలీసుల దగ్గరికి వెళ్లాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మూడురోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటూ సురేష్ ఇవాళ కన్నుమూశాడు. సురేష్ మృతిచెందినట్లు ఉస్మానియా వైద్యులు ప్రకటించారు. కాగా ఈ నెల 4న సురేష్, విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం […]

బ్రేకింగ్: విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి

Edited By:

Updated on: Nov 07, 2019 | 4:29 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి చెందాడు. విజయారెడ్డిని తగలబెడుతూ తీవ్రంగా గాయపడ్డ సురేష్ ఆ తరువాత కాలిన గాయాలతోనే పోలీసుల దగ్గరికి వెళ్లాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మూడురోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటూ సురేష్ ఇవాళ కన్నుమూశాడు. సురేష్ మృతిచెందినట్లు ఉస్మానియా వైద్యులు ప్రకటించారు. కాగా ఈ నెల 4న సురేష్, విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. మరోవైపు విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా.. ఈ కేసును సీబీఐకు అప్పగించాలంటూ ఆమె భర్త సుభాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే సురేష్ దాడి వలన ఇప్పుడు మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. విజయారెడ్డితో పాటు ఆమె డ్రైవర్ ఇప్పటికే మృతి చెందగా.. ఇప్పుడు సురేష్ కన్నుమూశాడు.