Telangana: త్వరలోనే కరీంనగర్ – హైదరాబాద్ రైలు ప్రయాణం.. కేసీఆర్ సంకల్పంతోనే సాధ్యమన్న మంత్రి హరీశ్..

|

Nov 29, 2022 | 3:48 PM

ఉత్తర తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారి కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైంది. 2023 ఫిబ్రవరి వరకు కుకునూరుపల్లికి రైలు రాబోతోదని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ ...

Telangana: త్వరలోనే కరీంనగర్ - హైదరాబాద్ రైలు ప్రయాణం.. కేసీఆర్ సంకల్పంతోనే సాధ్యమన్న మంత్రి హరీశ్..
Karimnagar Railway Station
Follow us on

ఉత్తర తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారి కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైంది. 2023 ఫిబ్రవరి వరకు కుకునూరుపల్లికి రైలు రాబోతోదని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ ప్రంతానికి రైలు వస్తే కరీంనగర్ – హైదరాబాద్ మధ్య ప్రయాణం సులభంగా మారుతుందన్నారు. కుకునూరుపల్లి ప్రజల కళ్లల్లో బతుకమ్మ-దసరా పండుగ కలిసి వస్తే ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం చూస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండల ఏర్పాటు అయ్యిందన్న హరీశ్ రావు..15 గ్రామ పంచాయతీలతో 20 వేల జనాభాతో అభివృద్ధఇలో దూసుకుపోతున్నామని చెప్పారు. తెలంగాణ రాకపోయి ఉంటే సిద్దిపేట జిల్లా అయ్యేదా.. కుకునూరుపల్లి మండలం అయ్యేదా.. ఇదంతా కేసీఆర్ దృఢ సంకల్పం వల్లేనని హరీశ్ రావు స్పష్టం చేశారు.

కాగా.. కరీంనగర్ రైల్వే లైన్‌కు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నాయి. వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల వారికి రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలనే ముఖ్యమైన ఆలోచనతో ముందడుగు వేస్తున్నామన్నారు. 2006-07లో ఆగిపోయిన రైల్వే లైన్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్తవుతుందని భావించారు. అయినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ రూట్‌లో వచ్చే నష్టాలను ఐదేళ్ల పాటు భరించేందుకు కూడా తెలంగాణ సర్కారు ముందుకొచ్చింది. దీంతో 2016 లో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది.

మనోహరాబాద్- గజ్వేల్ మధ్య 32 కిలోమీటర్ల వరకు ట్రాక్‌ పూర్తైంది. ట్రయల్‌ రన్స్‌ కూడా నడిపిస్తున్నారు. మిగతా 119 కిలోమీటర్ల మేర ట్రాక్ పనులు పూర్తి కావాలి. కొత్తపల్లి, సిరిసిల్లలో సమస్యల్ని పరిష్కరించినప్పటికి వేములవాడలో రైతులు పరిహారం సరిపోదంటూ కోర్టుకు వెళ్లారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అడుగడుగున బ్రేక్‌లు పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందోనని
చెప్పడం ప్రశ్నార్థకంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..